Olive Oil: మీ రెగ్యులర్ వంటనూనె స్థానంలో ఆలివ్ ఆయిల్ చేరిస్తే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
Olive Oil: నిత్యం ఎన్నోరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులే చాలా వరకూ కారణాలుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో వంటింటి ఆయిల్ మార్చి చూస్తే కచ్చితంగా ప్రయోజనం కన్పిస్తుంది. రిఫైండ్ ఆయిల్స్ స్థానంలో ఆలివ్ ఆయిల్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఎందుకంటే..
Olive Oil: నిత్యం ఎన్నోరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులే చాలా వరకూ కారణాలుగా ఉంటున్నాయి. ఈ క్రమంలో వంటింటి ఆయిల్ మార్చి చూస్తే కచ్చితంగా ప్రయోజనం కన్పిస్తుంది. రిఫైండ్ ఆయిల్స్ స్థానంలో ఆలివ్ ఆయిల్ మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఎందుకంటే..(Check Diabetes and Cholesterol other health Disorders with Olive Oil, Benefits of Olive Oil)
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకొస్తున్నారు. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే..మరికొన్ని పదార్ధాల్ని వదిలేస్తున్నారు. మనకు ఎదురయ్యే చాలా వ్యాధులకు రోజూ వంటల్లో వాడే ఆయిల్ ప్రధాన కారణమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా వాడే రిఫైండ్ ఆయిల్, లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ స్థానంలో ఆలివ్ ఆయిల్ వాడమంటున్నారు. ఆలివ్ ఆయిల్ వినియోగిస్తే కలిగే లాభాలేంటనేది ఇప్పుడు చూద్దాం.
ఆలివ్ అయిల్‌లో చాలా పోషక పదార్ధాలున్నాయి. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మానికి నిగారింపు వస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మరోవైపు ప్రస్తుత తరుణంలో కావల్సిన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్‌ను రోజువారీ వంటల్లో భాగంగా చేసుకుంటే..క్రమంగా ఊబకాయం కూడా తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ కారణంగా శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కరగడంతో..బరువు కూడా తగ్గుతుంది. ఇక ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యలుగా ఉంటున్న డయాబెటిస్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఆలివ్ ఆయిల్‌కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదంటున్నారు వైద్య నిపుణులు. ఆలివ్ ఆయిల్ అనేది కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా..రక్త ప్రసరణను అదుపులో ఉంచుతుంది.
వయస్సు పెరిగే కొద్దీ ఎముకల నొప్పి, కీళ్ల నొప్పి సర్వ సాధారణంగా కన్పిస్తుంది. ఈ క్రమంలో ఆలివ్ ఆయిల్ వాడితే కచ్చితంగా మంచి ఫలితముంటుంది. ఆలివ్ ఆయిల్‌లో సమృద్ధిగా లభించే కాల్షియం ద్వారా..శరీరంలో కాల్షియం లోపం తగ్గించవచ్చు. ఇక నూటికి 60-70 మందిలో ప్రధానంగా కన్పించే డయాబెటిస్ సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. రోజువారీ ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ను చేర్చుకుంటే..బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
Also read: Migraine Prevention Diet: మైగ్రేన్ తలనొప్పిని నుంచి విముక్తి పొందాలంటే ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook