Lemon Juice Benefits: నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Lemon Juice Benefits: గోరువెచ్చని నీటిలో ప్రతిరోజూ నిమ్మరసం కలుపుకొని తాగమని మన ఇంట్లో పెద్దవారు సూచిస్తుంటారు. అయితే దాని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఇది చేయడం సహా నోటి దుర్వాసన, జీర్ణక్రియ వంటి సమస్యలకు నిమ్మరసంతో స్వస్తి పలకవచ్చు.
Lemon Juice Benefits: నిమ్మకాయ వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. శరీరానికి విటమిన్ - సి ని అందజేయడం సహా వేసవిలో నిమ్మరసాన్ని పుచ్చుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గిపోతుంది. దీంతో పాటు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు శరీరానికి సమకూరుతాయని చాలా మందికి తెలియని విషయం. ఇలా వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అయితే నిమ్మరసం వల్ల శరీరానికి కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం ప్రయోజనాలు..
1) ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల వేసవిలో మనం డీహైడ్రేషన్ కు గురికాకుండా మేలు చేస్తుంది.
2) హైడ్రేష్ నుంచి శరీరాన్ని కాపాడడం సహా చర్మానికి కూడా నిమ్మరసం మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు సహాయపడుతుంది.
3) నిమ్మరసంలోని విటమిన్ - సి వల్ల చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపిస్తుంది.
4) బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రోజూ నిద్ర పోయే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల వెంటనే బరువు తగ్గే అవకాశం ఉంది.
5) అధిక బరువు తగ్గడం వల్ల పొట్ట కంట్రోల్ అవుతుంది.
6) జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. జీర్ణక్రియ సరిగ్గా జరగక పోతే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
7) నిమ్మకాయ రసాన్ని మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ లా పనిచేస్తుంది. నోటి దుర్వాసన రాకుండా నిమ్మరసం పనిచేస్తుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Amla Hair Benefits: ఉసిరి కాయల వినియోగంతో తెల్ల జుట్టు మటుమాయం!
Also Read: Garlic Tea Benefits: టీలో మరో కొత్త రకం.. వెల్లుల్లి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.