Garlic Tea Benefits: టీలో మరో కొత్త రకం.. వెల్లుల్లి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Garlic Tea Benefits: భారతదేశంలో చాలా మంది టీని రిఫ్రెష్మెంట్ డ్రింక్ గా భావిస్తారు. కొందరికి టీ బూస్టర్ లా పనిచేస్తుంది. ఇప్పటి వరకు అనేక రకాల టీలు ప్రజలకు పరిచయమయ్యాయి. అయితే ఇప్పుడు అదే కోవలో గార్లిక్ టీని మీకు పరిచయం చేస్తున్నాం. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 03:40 PM IST
Garlic Tea Benefits: టీలో మరో కొత్త రకం.. వెల్లుల్లి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Garlic Tea Benefits: టీ అంటే మన దేశంలో చాలా మంది ఇష్టపడతారు. ఉదయాన్నే రిఫ్రెష్ అవ్వడానికి దీన్ని తాగుతుంటామని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇప్పటి వరకు టీలలో అల్లం, పుదీనా, నిమ్మకాయ ప్లేవర్ తో తయారు చేస్తారని అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు టీలో మరో వెరైటీ వెల్లుల్లి టీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. వీటితో పాటు వెల్లుల్లి టీ వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

వెల్లుల్లి టీ వల్ల కలిగే 7 ప్రయోజనాలు

1. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గార్లిక్ టీ చాలా మేలు చేస్తుంది. దీని ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇది జీవక్రియలో కూడా సహాయపడుతుంది.

2. వెల్లుల్లి టీ శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తుంది.

3. గార్లిక్ టీని తరచుగా తాగడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. శరీరంలోని అనేక భాగాల్లో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. 

4. గార్లిక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులను నివారించవచ్చు. 

5. గార్లిక్ టీ శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణని ఇస్తుంది. చలికాలంలో కూడా దీన్ని తింటే జ్వరం, దగ్గు తగ్గుతాయి.

6. ఈ టీ ఒక శక్తివంతమైన యాంటీబయాటిక్ డ్రింక్. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

7. గార్లిక్ టీ కడుపులో మంటను తగ్గిస్తుంది.

వెల్లుల్లి టీ ఎలా తయారు చేయాలి?

వెల్లుల్లి టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు నీటిని మరిగించాలి. కొద్దిసేపటి తర్వాత, తరిగిన వెల్లుల్లి అందులో కలపాలి. దీనితో, ఒక చెంచా నల్ల మిరియాలు వేసి, ఈ టీని ఐదు నిమిషాలు ఉడకనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి టీని గిన్నెలోకి వడకట్టాలి. మీ శరీరానికి మరిన్ని ప్రయోజనాలను అందించే గార్లిక్ టీ సిద్ధమైనట్లే!!  

Also Read: Curd Sugar Benefits: పెరుగు, చక్కెర కలిపి తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Also Read: Belly Fat Loss Drink: ఈ డ్రింక్ తాగితే కేవలం నెల రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News