Benefits Of Consuming Nuts: శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం ఏంతో మేలు కలిగిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకమైన గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది. అయితే కొన్ని గింజలను తప్పుకుండా మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.     ఎలాంటి గింజలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాఫీ గింజలు: కాఫీ గింజల నుంచి కాఫీ పొడిని తయారు చేసుకుంటాం. అయితే ఈ గింజలతో చేసిన కాఫీ కాళీ కడుపుతో తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం రావడానికి తక్కువ ఛాన్స్‌లు ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


సబ్జా గింజలు: సబ్జా గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. 


అవిసె గింజలు: మెదడును చురుకుగా ఉంచడంలో ఈ అవిసె గింజలు ఏంతో మేలు చేస్తాయి.


చియా గింజలు: ఈ విత్తనాలను తీసుకుంటుంటే గుండె జబ్బులు, ఎముక సమస్యలు, బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది.


Also read: High Blood Pressure: రెండు చిటికెల యాలకుల పొడితో అధిక రక్తపోటు సమస్యకు చెక్..


గుమ్మడి గింజలు: క్యాన్సర్ నివారించడంలో ఎంతో సహాయపడుతాయి.  గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.


నువ్వులు: నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.  అంతేకాకుండా రక్తహీనత, బలహీనతతో బాధపడుతున్న వారికి సహాయపడుతాయి.


గసగసాలు: శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిచండలో సహాయపడుతుంది. దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


పొద్దుతిరుగుడు గింజలు:  కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు, రక్తంలో షుగర్‌ ను తగ్గిస్తుంది.


Also read: Garlic Benefits: రోజూ పరగడుపున 3-4 వెల్లుల్లి రెమ్మలు తింటే చాలు 3 వారాల్లో సన్నబడటం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook