Importance Of Blood Donation: రక్తదానం చేసే ముందు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.!
10 Reasons To Donate Blood: రక్తదానం ఒకరి ప్రాణాన్ని కాపాడేందుకు సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే రక్తదానం చేసే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని అంశాలను ఉన్నాయి.
10 Reasons To Donate Blood: రక్తదానం చేయడం వల్ల ఇతరులు ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానాన్ని మహాదానం అంటారు. రక్తదానం చేయమని ప్రభత్వం, కొన్ని సంస్థలు ప్రజలను ప్రోత్సహిస్తాయి. అయితే రక్తదానం ప్రతిఒక్కరు చేయలేరు. ఇది చేయడానికి వైద్యరంగంలో కొన్ని నియమాలున్నాయి. రక్తం ఎంత దానం చేయాలి? మీరు రక్తదానం చేసిన వెంటనే మీ శరీరంలో ఏమి జరుగుతుంది? రక్తదానం చేసే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
చాలా మంది రక్తదానం అంటే ఎక్కువగా రక్తం ఇవ్వాల్సి ఉంటుందని అపోహ పడుతుంటారు. సాధారణంగా ఒక వ్యక్తి రక్తదానం కోసం ఎవాల్యూయేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తి ఫిట్ చెక్ చేస్తారు. అయితే రక్త దానం అనేది ఒక పింట్ రక్తాన్ని అంటే 450 ml దానం చేయవచ్చు. మన శరీరంలో నాలుగు నుంచి ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. ఎక్కువగా రక్తం దానం చేయడం వల్ల మైకమం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
రక్తందానం చేసిన తర్వాత రక్తంలో మిగిలిన భాగాలు కొన్ని రోజుల్లో శరీరంలో భర్తీ చేయబడతాయి. రక్తదానం చేసిన తర్వాత కొందరిలో మైకము సంభవిస్తుంది. పదిహేను నిమిషాల బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల మైకము తగ్గుతుంది.ఇలా జరగకుండా ఉండాలంటే రక్తదానం చేసే ముందు నీరు త్రాగడం, పండ్ల రసం, తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అయితే రక్తదానం చేసిన తర్వాత 24 గంటల పాటు ఎలాంటి కఠినమైన పనులు చేయకుండా ఉండాలి. బరువులు ఎత్తకుండా ఉండాలి. నెదర్లాండ్స్ పరీశోధన ప్రకారం రక్తదానం చేసిన తర్వాత మైకము, వాంతులు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తదానం చేసిన 24 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే లక్షణాలు ఉంటాయి. ఒక శాతం మందిలో మాత్రం తేలికపాటి లక్షణాలు సుమారు 3 రోజుల వరకు ఉంటాయి.
రక్తదానం చేసిన ఒక రోజు తర్వాత సులభంగా వ్యాయామం ప్రారంభించవచ్చు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసే ముందు వారి హిమోగ్లోబిన్ స్థాయితో సహా ఫిట్‌నెస్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే శరీర బరువు కూడా రక్తదానానికి ముఖ్యమైన అంశం అని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter