Lifestyle changes can keep diabetes away: అస్వస్థతకు గురిచేసే జీవక్రియ సిండ్రోంగా డయాబెటిస్ వ్యాధిని పేర్కొంటారు. కారణం- డయాబెటిస్ వాతావరణ కారకాల వలన, జన్యుపరంగా సంక్రమించే అవకాశం ఉంది మరియు శరీర రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయి. ఇక్కడ కొన్ని రకాల సూచనల పాటించటం వలన డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ కలగటానికి గల కారణాలు


డయాబెటిస్ రావటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది- శరీరానికి కావలసిన స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి చెందకపోవటం, రెండవది- ఉత్పత్తి చెందిన ఇన్సులిన్ ను శరీరం వినియోగించుకోకపోవటం. ఈ రెండు కారణాల వలన 'హైపర్ గ్లైసిమియా' కలుగుతుంది. ఈ ప్రభావం అధికమవటం వలన డయాబెటిస్ వస్తుంది.


Also Read: Women Eating Dead Husband Ashes: చనిపోయిన భర్త చితాభస్మాన్ని తింటున్న మహిళ.. వైరల్ స్టోరీ


బహిర్గత లక్షణాలు
1) అధిక మూత్ర విసర్జనతో బలహీనత
2) దాహం పెరుగుతుంది
3) అస్పష్టమైన దృష్టి
4) కారణం లేకుండా బరువు నష్టం
4) నిద్రమత్తు


వ్యాధి నివారణ
డయాబెటిస్ కు  జీవితకాలం పాటూ చికిత్స తీసుకోవాలి. ఈ వ్యాధిని నివారించగలం కానీ శాశ్వత చికిత్స అందుబాటులో లేదు. టైప్-1 మధుమేహన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా మరియు కొన్ని ప్రత్యేక ఆహార ప్రణాళిక, జీవనశైలిలో మార్పులు ద్వారా తగ్గించవచ్చు. టైప్-2 మధుమేహాన్ని, ఆహార ప్రణాళిక, మందులు మరియు ఇన్సులిన్ ఉపభాగాల ద్వారా చికిత్స చేయవచ్చు.


Also Read: Samantha Defamation Case: కోర్టును ఆశ్రయించిన సమంత..యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!


సంక్లిష్టతలను తగ్గించటం
సరైన రీతిలో చికిత్స అందించని ఎడల, డయాబెటిస్ శరీరంలో ఏదైనా భాగాన్ని ప్రభావానికి గురిచేసి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. డయాబెటిస్ ను సరైన స్థాయిలో నిర్వహించని ఎడల కళ్లు, మూత్రపిండాలు, నరాలు, హృదయం, రక్తనాళాలు మరియు మెదడు వంటి ముఖ్య భాగాలను ప్రమాదానికి గురి చేస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ, జీవనశైలిలో మార్పులను అనుసరించటం వలన డయాబెటిస్ ను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించవచ్చు.


డయాబెటిస్ ను తగ్గించే చిట్కాలు
1) ఆరోగ్యకరమైన జీవనశైలి
2) సరైన ఆహార సేకరణ
3) వ్యాయామాల అనుసరణ
4) బరువు నిర్వహణ
5) ఆల్కహాల్ సేకరణను మానేయటం
6) సిగరెట్ కు దూరంగా ఉండటం
7) డయాబెటిక్ సాక్స్ లను ధరించండి
డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి, ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించిన, రోజు మందుల వాడకాన్ని మాత్రం మరవకండి. 


Also Read: Mukku Avinash Wedding:పెళ్లి చేసుకున్న ముక్కు అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్!


పరీక్షలు
డయాబెటిస్ పెరగకుండా ఉండటానికి గానూ, దీని సంబంధిత పరీక్షలు చేపించటం చాలా అవసరం. ముఖ్యంగా భారతదేశంలో ఈ వ్యాధికి గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది కావున డయాబెటిస్ టెస్ట్ ను జరిపించుకోవటం జీవన విధానంలో ఒక అలవాటుగా మార్చుకోండి.


చాలా మంది ఆరోగ్య నిపుణులు, 40 లేదా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు, సమయానికి అనుగుణంగా పరీక్షలు అనుసరిస్తూ, డయాబెటిస్ పట్ల తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచిస్తున్నారు. నిజానికి డయాబెటిస్ గురవటానికి స్థూలకాయత్వం, డయాబెటిస్ పట్ల కుటుంబ చరిత్ర, అనారోగ్యాకర ఆహార సేకరణ మరియు జీవన శైలిని అనుసరించటం వలన అని చెప్పవచ్చు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook