Liver Detox Tips: మనిషి శరీరంలో లివర్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగించడంలో లివర్ పాత్ర చాలా కీలకం. అదే లివర్ పాడయితే మొత్తం అన్ని అవయవాలపై ఆ ప్రభావం పడుతుంది. క్రమంగా ప్రాణాంతకం కావచ్చు కూడా. అందుకే లివర్‌ను సహజసిద్ధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. లివర్ క్లీనింగ్ ఎలాగని సందేహిస్తున్నారా..కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్‌తో లివర్‌ను అద్భుతంగా క్లీన్ చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం వంటివి లివర్ ఆరోగ్యంపై ప్రధానంగా దుష్ప్రభావం చూపిస్తాయి. లివర్‌ను ఎప్పటికప్పుడు సహజసిద్ధంగా డీటాక్స్ చేస్తుండాలి. కేవలం మద్యపానం ఒక్కటే లివర్ పాడవడానికి కారణం కాదు. మనం తీసుకునే జంక్ ఫుడ్స్, ఫాస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ పదార్ధాల వల్ల లివర్‌లో చెత్తంతా పేరుకుపోతుంటుంది. సాధారణంగా లివర్‌కు తనను తాను క్లీన్ చేసుకునే సామర్ధ్యం ఉంటుంది కానీ శృతి మించితే లివర్ కూడా చెడిపోతుంది. అందుకే కొన్ని లక్షణాలు కన్పిస్తే లివర్ పరిస్థితి బాగాలేదని అర్ధం చేసుకుని వెంటనే వైద్యుని సంప్రదించాలి. 


లివర్‌లో సమస్య ఉంటే కన్పించే లక్షణాల్లో ప్రధానంగా చర్మంలో దురద రావడం, యూరిన్ చిక్కగా ఉండటం, తరచూ అలసట రావడం, వికారం లేదా వాంతులు, కడుపులో నొప్పి, స్వెల్లింగ్ సమస్య, చర్మం పసుపుగా మారడం, కళ్లు తెల్లబడటం వంటివి కన్పిస్తాయి. ఈ లక్షణాలు మీలో ఎప్పుడైనా కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 


లివర్‌ను సహజసిద్ధంగా క్లీన్ చేసేందుకు కొన్ని డ్రింక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. క్యామోమైల్ టీ. ఇదొక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్రలేమి సమస్య దూరమౌతుంది. ఓ గ్లాసు ఉడికిన నీళ్లలో ఒక స్పూన్ క్యామోమైల్ పువ్వులు వేసి 10 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తరువాత తాగాలి. కనీసం రెండు వారాలు తాగితే మంచి ఫలితాలు కన్పిస్తాయి. 


పుదీనా టీ మరో మంచి ప్రత్యామ్నాయం. పుదీనా ఆకుల్లో ఉండే మెంతాల్, మెంథోన్ వంటి పోషకాలు శరీరాన్ని ముఖ్యంగా లివర్‌ను డీటాక్స్ చేయడంలో ఉపయోగపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఓ గిన్నెలో నీళ్లు ఉడకబెట్టి అందులో కొన్ని పుదీనా ఆకులు వేయాలి. కాస్సేపు అలానే ఉంచి రాత్రి పడుకునే ముందు తాగితే మంచి ఫలితాలుంటాయి. 


మెంతి నీళ్లు కూడా మరో మంచి ఆప్షన్. మెంతి నీళ్లు రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కేవలం ఒక స్పూన్ మెంతి పౌడర్ లేదా మెంతులు నీళ్లలో వేసి బాగా ఉడికించాలి. చల్లారిన తరువాత తాగేయాలి. రోజూ పరగడుపున చేస్తే మంచి ఫలితాలుంటాయి.


అల్లం నిమ్మ టీ కూడా శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు లివర్ శుభ్రపర్చేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదొక శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రింక్. దీనివల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఒక గ్లాసు ఉడుకుతున్న నీళ్లలో సగం నిమ్మరసం, కొద్దిగా అల్లం వేయాలి. 15 నిమిషాలు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చగా సేవించాలి.


ఆయుర్వేదంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఔషధపరంగా అద్భుతమైందిగా భావిస్తారు. పసుపు టీ ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. 


Also read: Weight Loss Tips: జీలకర్రను ఇలా తీసుకుంటే 3 వారాల్లో ఫిట్ అండ్ స్లిమ్ అవడం ఖాయం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook