Weight Loss Tips in 20 Days: ఆధునిక జీవనశైలి కారణంగా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది. చాలా మంది వివిధ అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా తీవ్ర వ్యాధులైన మధుమేహం, గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా జీవనశైలిలో కొన్ని మార్పలు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకుంటే శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా బరువు తగ్గొచ్చు:


అల్పాహారం మానుకోవద్దు:
ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడానికి అల్పాహారాలు మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ప్రతి రోజు అల్పాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఉదయం టిఫిన్‌గా ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. 


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


అతిగా ఆహారాలు తినొద్దు:
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అవసరమైన దానికంటే ఎక్కువ తినడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆహారాలు తినే క్రమంలో నమిలి బాగా తినాలి. లేకపోతే శరీర బరువు తగ్గడం కంటే పెరిగే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


వ్యాయామాలు తప్పని సరి:
బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాకింగ్‌ చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. శరీరం కూడా దృఢంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి