Platelet Count Problem: రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు ఇతర సమస్యలు చాలా ఎదురౌతాయి. ముఖ్యంగా పెద్దమొత్తంలో రక్తం ఫ్లో అవుతుంది. ఈ నేపధ్యంంలో ప్లేట్‌లెట్ కౌంట్ పెంచేందుకు తక్షణం డైట్‌పై తగిన దృష్టి సారించాలి. ఎందుకంటే డైట్ సరిగ్గా ఉంటే ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తంలో ఉండే చిన్న చిన్న కణాల్ని ప్లేట్‌లెట్స్ అంటారు. ఇవి రక్తాన్ని చిక్కగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. మీ రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉంటే రక్తస్రావం సమస్య అధికంగా ఉంటుంది. ప్లేట్‌లెట్ కౌంట్‌ను త్రోంబోసైటోపేనియా అని కూడా పిలుస్తారు. జీన్స్ పరంగా కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. డెంగ్యూ, ల్యుకేమియా, కేన్సర్ వంటి వ్యాధులు, మెడికల్ కండీషన్, మందుల ప్రభావం వంటి కారణాలతో ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ సోకితే ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పడిపోతుంది. 


హెల్తీగా ఉండే వ్యక్తిలో సాధారణ ప్లేట్‌లెట్ కౌంట్ అనేది 1 లక్షా 50 వేల నుంచి 4 లక్షల 50 వేల వరకూ ఉండవచ్చు. మహిళల్లో అయితే 1 లక్షా 50 వేల నుంచి 3 లక్షల 50 వేల వరకూ ఉంటుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉందో తెలుస్తుంది. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉంట ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. గాయాలవడం, చర్మం నీలంగా మారడం కూడా లక్షణాలే. మహిళలకైతే పీరియడ్స్ సమయంలో హెవీ బ్లీడింగ్ ఉంటుంది. బ్లాక్ లేదా బ్లడ్‌తో కూడిన మలం కన్పిస్తుంది. 


ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు చికిత్సా పద్ధతులు కూడా వేర్వేరుగా ఉంటాయి. యాంటీ బయోటిక్స్ ఇవ్వవచ్చు. ఆటో ఇమ్యూన్ కారణంగా ఈ సమస్య తలెత్తితే వేరే రకంగా చికిత్స ఉంటుంది. కేన్సర్ లేదా ల్యుకేమియా కారణమైతే మరో చికిత్స ఉంటుంది. 


అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు 10 వస్తువులను పూర్తిగా దూరం పెట్టాలి. మద్యం, ఫ్రైడ్ పదార్ధాలు, రెడ్ మీట్, హై సోడియం ఫుడ్స్, వెల్లుల్లి, ఉల్లి, టొమాటో, పసుపు, అల్లం, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి రక్తాన్ని మరింత పల్చగా చేస్తాయి. తద్వారా సమస్య మరింత పెరుగుతుంది. 


Also read: High Protein: ప్రొటీన్‌ ఎక్కువగా తింటున్నారా? కేన్సర్‌, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు తస్మాత్ జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook