Lower Chest Pain: ఛాతీ నొప్పికి రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఛాతీ దిగువ భాగంలో నొప్పి ఉంటే అది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఛాతీ నొప్పి వల్ల గ్యాస్‌ లేదా ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఛాతీలో తీవ్ర నొప్పులు రావడం వల్ల ఇతర కారణాలకు కూడా దారీ తీయోచ్చు.
 
నొప్పి తీవ్రమైతే ఈ సమస్యలు తప్పవు:
గుండె వ్యాధులు:

ఛాతీలో నొప్పి ఉంటే అది గుండె సమస్యలకు దారీ తీయోచ్చు. అంతేకాకుండా గుండె జబ్బులకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో భుజం, దవడ వరకు కూడా చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడుపు సమస్యలు:
గ్యాస్, ఎసిడిటీ, కండరాలలో వాపు వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఛాతీ నొప్పికి కారణమవుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల దీర్ఘకాలీక వ్యాధులకు కూడా దారీ తీయోచ్చు.


ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్‌:
ఛాతీ నొప్పుల కారణంగా ఊపిరితిత్తులలో కూడా ఇన్ఫెక్షన్స్‌ రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా న్యుమోనియా, ఆస్తమా, క్రానిక్ బ్రోన్కైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి ఇలా నొప్పి క్రమం తప్పకుండా వస్తే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


కండరాలు, ఎముకలు:
ఛాతీ కింది భాగంలో నొప్పికి కండరాలు, ఎముకలు కూడా కారణం కావచ్చు. ఎముకలకు గాయం కావడం వల్ల కూడా ఛాతీ నొప్పిలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు కలిగి ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


ఆందోళన, ఒత్తిడి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఎక్కువ మంది టెన్షన్స్‌ కూడా గురవుతున్నారు. అయితే ఇది ఛాతీ నొప్పికి కూడా దారీ తీయోచ్చు. ఆందోళన గుండెపోటుకు కూడా కారణం కావచ్చు.


గుండెను ఎలా రక్షించాలి:
క్రమం తప్పకుండా ఛాతీ నొప్పులు వస్తే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెంటనే  వైద్యుడిని సంప్రదించాలి. లేక పోతే కొందరిలో ఇది ప్రాణాంతకంగాను మారొచ్చు. ఇలా సమస్యల రాకుండా ఉండడానికి ఆహారంలో మార్పులు చేసుకోండి.  ఛాతీ నొప్పి తీవ్రమైన సమస్య, ఈ సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అటువంటి నొప్పిని అధిగమించడానికి, మీ జీవనశైలిని మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం. మీ ఆహారంలో మార్పులు చేసుకోండి. ప్రొటీన్లు, పీచుపదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook