Lung Cancer Signs: మీ చర్మంపై ఈ 5 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, లంగ్ కేన్సర్ కావచ్చు
Lung Cancer Signs: ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ వంటి మహమ్మారికి ఇంకా సరైన చికిత్స అందుబాటులో లేదు. కారణంగా ఆలస్యంగా గుర్తించగలగడమే. అయికే కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను ముందుగా కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చంటున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Lung Cancer Signs: ఇటీవలి కాలంలో చెడు అలవాట్లు లేదా కాలుష్యం వల్ల లంగ్ కేన్సర్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చర్మంపై కన్పించే కొన్ని లక్షణాలతో ఈ వ్యాధిని పసిగట్టవచ్చు. అందుకే మీక్కూడా చర్మంపై ఇలాంటి లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు.
లంగ్ కేన్సర్ లక్షణాల్లో ప్రధానంగా దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కన్పిస్తాయి. కానీ చర్మంలో కన్పించే కొన్ని మార్పులు లేదా లక్షణాలు కూడా లంగ్ కేన్సర్ సంకేతం కావచ్చు. ముఖ్యంగా చర్మంపై 5 లక్షణాలు లేదా మార్పులు గమనించవచ్చు. చర్మం నీలం లేదా పర్పుల్ రంగులో మారడం. లంగ్ కేన్సర్ ఉన్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దాంతో చర్మం రంగు మారి నీలం లేదా వంకాయ రంగులో మారవచ్చు. మరీ ముఖ్యంగా వేళ్లు, గోర్లు, చేతులపై కన్పిస్తుంది.
చర్మంపై గీతలు లేదా దద్దుర్లు రావడం కూడా మరో లక్షణం. లంగ్ కేన్సర్ కారణంగా చర్మంపై దద్దుర్లు వ్యాపించవచ్చు. ఇవి ఎక్కువగా ఛాతీపై లేదా మెడపై కన్పిస్తాయి. చర్మం తరచూ దురదగా ఉండటం మరో సంకేతం. లంగ్ కేన్సర్ కారణంగా కొంత మందికి చర్మం దురద ఉంటుంది. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా ఉండవచ్చు. చర్మంపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడటం మరో లక్షణం. లంగ్ కేన్సర్ కేసుల్లో కన్పించే లక్షణాల్లో ఇదొకటి. చర్మంపై ఎరుపు రంగులో మచ్చలు కన్పిస్తాయి. ఇవి ఎక్కడైనా ఏ భాగంలో అయినా రావచ్చు.
ముఖం సగ భాగంలో చెమట్లు రావడం ప్రధాన లక్షణంగా గమనించవచ్చు. సాధారణంగా చెమట్లు పట్టినప్పుడు మొత్తం అంతటా పడుతుంటాయి. కానీ ముఖంపై ఒకవైపే చెమట్లు పడుతుంటే లంగ్ కేన్సర్ లక్షణం కావచ్చు. లంగ్ కేన్సర్ ఉన్నప్పుడు ట్యూమర్ చుట్టూ ఉన్న రక్త నాళాలను నొక్కి పెడుతుంది. దాంతో రక్త ప్రసరణ సరిగ్గా అవదు. ఆ ప్రభావం చర్మంపై పడుతుంది. కేన్సర్ కణాలు ఉత్పత్తి చేసే కొన్ని రకాల రసాయనాల కారణంగా కూడా చర్మంపై ఇలాంటి మచ్చలు కన్పిస్తాయి.
ఇలాంటి లక్షణాలు కన్పించినప్పుడు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యుని సంప్రదించాలి. త్వరగా వైద్యుని సంప్రదించడం ద్వారా లంగ్ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు త్వరగా చికిత్స చేయవచ్చు.
Also read: Breast Milk Foods: మీ పాలు బిడ్డకు సరిపోవడం లేదా, ఈ 8 ఫుడ్స్ ఇవాళే డైట్‌లో చేర్చండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook