Side Effects Of Using Smartphone: పెళ్లి తర్వాత సాధారణంగా ప్రతి మగాడు తండ్రి కావాలని ఆశపడతాడు. అయితే కొన్ని అలవాట్లు అతనికి సమస్యగా మారుతాయి. వీరు మెుబైల్, ల్యాప్‌టాప్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రస్తుత కాలంలో మొబైల్‌కి కొద్ది క్షణాల దూరం ఉన్నా చలించిపోతున్నారు. చాలా మంది వ్యక్తులు అర్థరాత్రి వరకు ఫోన్‌లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు లేదా వీడియోలను చూడటానికి ఇష్టపడతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్థరాత్రి వరకు గాడ్జెట్‌లు వాడటం వల్ల కలిగే నష్టాలు
మీరు కూడా అర్థరాత్రి వరకు ఫోన్ లేదా ల్యాప్‌టాప్ (Laptop) ఉపయోగిస్తుంటే... వెంటనే ఆ అలవాటును మానుకోండి. లేట్ నైట్ గాడ్జెట్‌లను ఉపయోగించడం వల్ల అది పురుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ఈ విషయం ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.  


పరిశోధనలో విస్తుపోయే నిజాలు
అమెరికాలోని వర్చువల్ స్లీప్ మ్యాగజైన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల నుండి వెలువడే బ్లూ లైట్ పురుషుల స్పెర్మ్ కౌంట్  (Sperm Count), స్పెర్మ్ నాణ్యతపై చెడు ప్రభావం చూపుతుంది. స్పెర్మ్ క్వాలిటీ చెడిపోతుంది. దీని ప్రభావం పురుషుల సంతానోత్పత్తిపై పడుతోంది.  ఈ అధ్యయనంలో, పరిశోధకులు 116 మంది పురుషుల నుండి స్పెర్మ్ నమూనాలను తీసుకున్నారు. ఈ పురుషులందరి వయస్సు 21 మరియు 59 సంవత్సరాల మధ్య ఉంది. అధ్యయనం ప్రకారం, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ పరికరాలు సంతానోత్పత్తిపై (Male Fertility) చెడు ప్రభావాన్ని చూపుతాయి.


ప్రయోజనాలు
అధ్యయనం ప్రకారం, అర్థరాత్రి వరకు ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఉపయోగించే పురుషులులో , వంధ్యత్వ రేటు పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకుండా టైంకు నిద్రపోయే స్పెర్మ్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది.


దేశంలో చాలా మందే..
ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ డీఎన్ఏను దెబ్బతీస్తుందని, కణాలు క్రమంగా కోలుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయని అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో 23 శాతం మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్నారు.


Also Read: Kidney Health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..రోజూ నిమ్మరసం ఇలా తాగండి చాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook