Mango Kernel Benefits And Side Effects: వేసవిలో అత్యధికంగా లభించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి.. ఇవి ఎండాకాలంలో విచ్చలవిడిగా లభిస్తూ ఉంటాయి. సమ్మర్ లో వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తింటారు. మామిడిపండు తినే క్రమంలో దానిపైన గుజ్జును తిని లోపల ఉన్న గింజను పడేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామిడి పండే కాకుండా గింజలు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు తీవ్రవ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. మామిడి గింజలను వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


మామిడికాయ గింజల్లో పొటాషియం, సోడియం, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పూర్వీకులు ఈ గింజలను పచ్చడులుగా కూడా చేసుకునే వారిని సమాచారం. 


Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  


మామిడిపండు గింజల వల్ల కలిగే లాభాలు:
జుట్టు సమస్యలకు చెక్:

మామిడిపండు గింజలను ఎండబెట్టి పొడిలా తయారు చేసుకుని.. నీటిలో కలుపుకొని పొడిని కలిపి మిశ్రమంల తయారుచేసి జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


చర్మ సమస్యలు దూరమవుతాయి:
ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మామిడి గింజలను ఉడికించి తయారు చేసిన నూనెను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మం పై గ్లో కూడా పెరుగుతుంది. కాబట్టి తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ఈ నూనెను వినియోగించవచ్చు.


అధిక రక్తపోటు:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఆహారంలో తప్పకుండా మామిడికాయ గింజను వినియోగించాల్సి ఉంటుంది. గింజలతో తయారుచేసిన చట్నీని క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు దూరమవుతాయి.


Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి