Mangoes vs Diabetes: వేసవి ప్రతాపం చూపిస్తోంది. మరోవైపు నోరూరించే పసందైన మామిడి పండ్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. రుచికరమైన మామిడి పండ్లను పండ్ల రారాజుగా పిలుస్తారు. అయితే డయాబెటిక్ రోగులు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు. డైటీషియన్లు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరాన్ని రిఫ్రెష్ చేసే ట్రోపికల్ ఫ్రూట్ మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. మామిడిలో సహజసిద్ధమైన పంచదార ఉంటుంది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు, మధుమేహవ్యాధిగ్రస్థులకు మామిడి పండ్ల విషయంలో ఎప్పుడూ సందేహాలు ఉండనే ఉంటాయి.


మామిడి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్


ఏదైనా తిన్నప్పుడు అది బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందనేది ఆ ఫ్రూట్ గ్లైసెమిక్ ఇండెక్స్‌పై ఆధారపడి ఉంటుంది. మామిడి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎంతవరకూ పండింది, ఏ రకానికి చెందిందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బాగా పండిన మామిడి పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది 41-60 మధ్యలో ఉంటుంది. సరాసరి చూసుకుంటే 51గా ఉంటుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ఓ మోస్తరు ప్రభావం చూపిస్తాయి.


డయాబెటిస్ రోగులు మామిడి పండ్లు ఎలా తీసుకోవాలి


మధుమేహ వ్యాధిగ్రస్థులు మామిడి పండ్లను ఇతర ఆహారంతో కలిపి తీసుకోవచ్చంటున్నారు డైటీషియన్లు. పూర్తిగా తినకుండా మామిడి పండులో 1-2 ముక్కలకు పరిమితం కావల్సి ఉంటుంది. అంతకంటే మంచి పద్ధతి మామిడి పండ్లను ప్రోటీన్లు ఉండే పెరుగు లేదా నట్స్‌తో కలిపి తింటే మంచిది. లేదా సలాడ్, ఆకుకూరలతో కలిపి మామిడి పండ్లు తీసుకుంటే ఏ విధమైన సమస్య ఉండదు. 


మామిడి పండ్లు తినేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు


మీరు డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ ఏదైనా సరే..మామిడి పండ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. మామిడి పండ్లను ఎప్పుడూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన మామిడి పండ్లను ఎంచుకోవాలి. మామిడి పండ్లను ఎప్పుడూ ప్రోటీన్లు, ఫైబర్‌తో కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం తక్కువగా ఉంటుంది. తీయని వాసన కలిగిన మామిడి పండ్లనే ఎంచుకోవాలి.ఎప్పటికప్పుడు ముఖ్యంగా మామిడి పండ్లు తిన్న తరువాత బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.


ఎక్కువ మోతాదులో మామిడి పండ్లు తినడం మంచిది కాదు. మామిడి జ్యూస్, స్మూతీస్‌కు దూరంగా ఉంటే మంచిది. ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే భోజనం తినేటప్పుడు మామిడి పండ్లు తినకుండా ఉంటే మంచిది. ద్రాక్ష, అరటి, చెర్రీస్ వంటి పండ్లతో కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రీ డయాబెటిక్ రోగులు ఫిజికల్ యాక్టివిటీ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. భోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. 


Also read: Weight loss tips: డైట్‌లో ఈ ఆకులుంటే చాలు..నెలరోజుల్లో స్థూలకాయానికి చెక్


రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినవచ్చు


రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినవచ్చనే విషయంలో పరిమితి లేదు. మీ వయస్సు, బరువు, శారీరక శ్రమ, మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మీడియం సైజ్ మామిడి పండ్లు రోజుకు 1-2 వరకూ తినవచ్చు. ఎక్కువైతే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.


Also read: Heart Health Tips: హార్ట్ ఎటాక్ ముప్పును దూరం చేసి, గుండెను ఆరోగ్యంగా ఉంచే పద్ధతులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook