Melon Benefits: వేసవిలో సూర్యతాపం నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు తగినన్ని నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అందులో పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి వాటిని తీసుకోవడం శరీరానికి మేలు జరుగుతుంది. అయితే ఈ క్రమంలో కర్బూజ జ్యూస్ ను తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడం సహా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అయితే కర్బూజ జ్యూస్ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్బూజ గింజలతో.. 


కర్బుజ పండులోని గింజలు కూడా ఆరోగ్యానికి సహయకారిగా పనిచేస్తాయి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఇ ఉన్నాయి. ఇవి కంటికి మేలు కలిగిస్తాయి. ఎ, సి, ఇ విటమిన్లు కంటికి సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇవి క్యాన్సర్ నివారణకు ఉపయోగకరంగా మారుతాయి. 


గుండెకు ఆరోగ్యం..


కర్బూజ పండు లేదా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం సహా గుండెకు సంబంధిత వ్యాధులను నియంత్రిడంలో సహాయపడుతుంది. 


కర్బూజ పండు తినడం వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుంది. అంతే కాకుండా.. కంటి చూపు మెరుగయ్యేందుకు సహాయపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్ ఊపిరితిత్తులను మంచి చేస్తాయి.  


Also Read: Cholesterol Control Tips: మామిడి పండుతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కు చెక్!


Also Read: Coconut Oil for face: కొబ్బరినూనెతో ముఖంపై ముడతలు చెక్! ఇలా చేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.