Mens Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం హోమ్ రెమిడీస్ చాలా ఉంటాయి. సరైన పద్ధతులు అవలంభిస్తే మానసికంగా, ధృడంగా ఉంటారు. శారీరక బలహీనతను దూరం చేసేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరాకృతి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొందరు బానకడుపుతో ఉంటే మరి కొందరు సన్నగా పీలగా బలహీనంగా ఉంటారు. ఫలితంగా శారీరకంగా ధృడంగా మారేందుకు పురుషులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాల ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్స్ వినియోగిస్తుంటారు. అయితే వీటివల్ల దుష్పరిణామాలు కూడా ఎదురౌతుంటాయి. ఈ క్రమంలో శారీరక బలహీనత మీకు పెద్ద సమస్యగా మారితే..కొన్ని సులభమైన చిట్కాలతో ధృడంగా మారవచ్చు. శారీరక బలహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


వెల్లుల్లితో..


మీరు శారీరకంగా బలహీనంగా ఉంటే మీ రెగ్యులర్ డైట్‌లో వెల్లుల్లిని జత చేయాలి. పురుషులకు వెల్లుల్లి చాలా ప్రయోజనకరం. శారీరక బలం కోసం రోజూ పరగడుపున వెల్లుల్లి తీసుకోవాలి. దీనికోసం ఓ నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఒలిచి..గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.


తృణధాన్యాలతో..


చాలామంది ఫాస్ట్‌ఫుడ్స్,కెఫీన్ లేదా ఆల్కహాల్ అధికంగా సేవిస్తుంటారు. కానీ అంతర్గతంగా బలంగా ఉండేందుకు మీరు డైట్‌లో తృణధాన్యాల్ని చేర్చుకోవాలి. తృణధాన్యాలనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. చాలా సమస్యల్నించి దూరం కావచ్చు.


అరటిపండ్లతో..


పురుషులు తమ డైట్‌లో అరటిపండ్లను తప్పకుండా చేర్చాలి. శారీరకంగా బలంగా ఉండాలంటే అరటి పండ్లు రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. అరటిపండ్లను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో అద్భుతమైన ఎనర్జీ, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరోవైపు అరటిపండ్లు తినడం వల్ల బలం వస్తుంది. రోజూ పాలతో పాటు రెండు అరటి పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


Also read: Diet For Diabetes: మెంతి ఆకులతో కూడా మధుమేహాన్ని చెక్‌ పెట్టొచ్చు.. ఎలానో మీకు తెలుసా.?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook