Diet For Diabetes: మెంతి ఆకులతో కూడా మధుమేహాన్ని చెక్‌ పెట్టొచ్చు.. ఎలానో మీకు తెలుసా.?

Diabetes Control In 7 Days: మధుమేహం అనేది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఓ వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా 7వ ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2022, 03:29 PM IST
  • మెంతి ఆకులను వినియోగించి..
  • మధుమేహాన్ని నియంత్రించవచ్చు
  • ఆకుల్లో విటమిన్ ఎ, బి6, సి, విటమిన్ కె లుంటాయి
Diet For Diabetes: మెంతి ఆకులతో కూడా మధుమేహాన్ని చెక్‌ పెట్టొచ్చు.. ఎలానో మీకు తెలుసా.?

Diabetes Control In 7 Days: మధుమేహం అనేది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఓ వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2030 నాటికి మధుమేహం ప్రపంచవ్యాప్తంగా 7వ ప్రాణాంతక వ్యాధిగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మధుమేహం ప్రాణాంతకంగా మారే చాన్స్ ఉంది. అయితే మధుమేహం నియంత్రించుకునేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందో తెలుసుకుందాం.. నిపుణులు మాత్రం మెంతి ఆకులతో చేసిన రైతాలను ఆహారంలో తీసుకుంటే త్వరలోనే డయాబెటిస్‌ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

డయాబెటిస్‌కు మెంతి ఆకులతో చెక్ పెట్టొచ్చా..?

కాశీ నుంచి కన్యాకుమారి వరకు మెంతి ఆకులను వంటకాల్లో వినియోగిస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో మెంతి ఆకుల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ ఆకుల్లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, విటమిన్ కె వంటి అనేక రకాల పోషకాలు ఈ ఆకులలో లభిస్తాయి. కావున బాడీకి అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇందులో మధుమేహంపై ప్రభావం చూపే కరిగే  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమంత తప్పకుండా వంటకాల్లో వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరుచుతాయి.

డయాబెటిస్‌లో మెంతి ఆకుల కంటే మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు రక్తంలో గ్లూకోజ్‌ను స్థాయిలను తగ్గిస్తాయి. కావున మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా డయాబెటిస్‌ ఉన్నవారు మెంతులు వేడి నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయం వడకట్టిన తర్వాత తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉదయం పూట ఈ నీటిని తాగితే శరీరంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు మెంతి పొడిని కూడా తీసుకోవచ్చు.. నీటిని వేడి చేసి అందులో రెండు చెంచాల పొడిని వేసి మరిగించి తాగాతే మధుమేహం త్వరలో నియంత్రణలోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.

Also Read: క్యాబ్ డ్రైవర్‌పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు.. డబ్బులు ఇవ్వకపోగా స్నేహితులతో కలిసి దాడి చేసిన నిందితుడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News