Painkiller Tablets: పీరియడ్స్ సమయంలో మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడవచ్చా లేదా
Painkiller Tablets: మహిళ జీవితంలో నెలసరి లేదా పీరియడ్స్ అనేది సర్వ సాధారణం. ఈ సమయంలో ప్రతి మహిళ చాలా అసౌకర్యంగా ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి..ఆ వివరాలు మీ కోసం.
Painkiller Tablets: ప్రతి మహిళ జీవితంలో ప్యూబెర్టీ నుంచి మెనోపాజ్ వరకూ ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ నెలసరి లేదా పీరియడ్స్. ఈ సమయంలో రక్తస్రావం జరుగుతుంటుంది. ఫలితంగా విపరీతమైన బలహీనతతో పాటు కడుపు నొప్పి, నడుము నొప్పి తీవ్రంగా ఉంటాయి. ఈ నొప్పుల నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామంది పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకుందాం.
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు కొంతమంది మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు. ఇది సాధారణమైన పద్ధతే. అయితే ఇలా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడటం మంచిదా కాదా అనే విషయంలో చాలా సందేహాలున్నాయి. పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు వైద్యుని ప్రిస్క్పిప్షన్ లేకుండానే ఇబూప్రోఫెన్, ఎసిటమినోఫెన్, నాప్రాక్సిన్ వంటి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడటం మంచిదా కాదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. కచ్చితంగా చెప్పాలంటే ప్రతిసారీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లపై ఆధారపడటం మంచిది కాదనే చెప్పాలి.
కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తీవ్రమైన నొప్పి భరించనంతగా ఉంటేనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడాలి. వైద్యులు కూడా అలాంటి పరిస్థితి ఉంటేనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ సూచిస్తుంటారు. అధిక మోతాదులో ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. ప్రతిసారీ తీవ్రమైన నొప్పి ఉంటుంటే మాత్రం వైద్యుని సంప్రదించాలి.
అందరికీ అన్ని రకాల పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు పడకపోవచ్చు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో నొప్పి ఒకటే అయినా శరీర తత్వం విభిన్నంగా ఉంటుంది. ఎవరికి ఏది మంచిదనేది వైద్యుని సలహా మేరకే నిర్ణయించాల్సి ఉంటుంది.
Also read: Poha Benefits: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా తింటే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.