Migraine Prevention Diet: మనలోని 50 శాతానికి మానసిక ఒత్తిడి పెరగడం వల్ల తరచూ తలనొప్పికి గురవుతుంటారు. అలాంటి తలనొప్పికి చెందిన అత్యంత సాధారణ రకాల్లో మైగ్రేన్ ఒకటి. నరాల సంబంధిత సమస్యలు ప్రధానంగా ఉన్న వారిలో ఈ మైగ్రేన్ తలనొప్పి రావొచ్చు. దీంతో పాటు వాంతులు, శబ్దం, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉండొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇతర రకాల తలనొప్పులతో పోలిస్తే.. మైగ్రేన్ తలనొప్పి గంటల నుంచి రోజుల తరబడి అలానే ఉంటుంది. రోజువారి చేసే పనులపై ప్రభావం చూపుతుంది. మైగ్రేన్ కు ఏకైక పరిష్కారం.. ఆరోగ్యకరమైన జీవనశైలీని అలవరచుకోవడమే! సరైన సమయంలో మందులు తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మైగ్రేన్ ను నియంత్రిచవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. 


1. పెరుగు


తిన్నది వెంటనే అరగకపోవడం.. డీహైడ్రేషన్ వంటి సమస్యలు తరచూ ఏర్పడితే అది మైగ్రేన్ కు ప్రధాన కారణాలు. వాటిని నివారించుకునే విధంగా ఆహరంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. రోజు తినే ఆహరంలో పెరుగు క్రమం తప్పకుండా వాడడం వల్ల అజీర్ణంతో పాటు ఇతర కడుపు సమస్యలను తొలగిస్తుంది. డీహైడ్రేషన్ ను నియంత్రించేందుకు సహకరిస్తుంది. 


2. హెర్బల్ టీ


శరీరాన్ని డీహైడ్రేటింగ్ సమస్యను కాపాడేందుకు అవసరమైన పానీయం హెర్బల్ టీ. దీని సేవించడం వల్ల కడుపులోని అజీర్ణ సమస్యలు నయం అవుతాయి. అల్లం టీ, పుదీనా టీ తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. పుదీనా ఆకులతో చేసిన టీ తాగడం వల్ల నెమ్ము తగ్గుముఖం పడుతుంది. అల్లం టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


3. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు


అవిసె గింజలు, చియా గింజలు, జీడిపప్పులలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం మైగ్రేన్‌లను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మైగ్రేన్ సమస్య క్రమంగా తగ్గుతుంది.


4. ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాలు
సముద్రంలో పెరిగే చేపలలో ఒమేగా 3 తగినంత మొత్తంలో లభిస్తుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సీఫుడ్, ముఖ్యంగా చేపలలో ప్రోటీన్లు, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. మైగ్రేన్‌లను నియంత్రించడంలో ఇది చాలా సహాయపడుతుంది.


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా వైద్యుల సలహాలను అనుకరించి రాసినది. దీని వల్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు మా ఈ ప్రయత్నం. అయితే ఈ సమాచారాన్ని ZEE తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Saunf Side Effects: మీకు ఆ సమస్య ఉందా..అయితే సోంపు తినవద్దు..లేకపోతే కలిగే అనర్ధాలివే


Also Read: Tulsi Seeds: కేన్సర్ కణాల్ని సైతం నియంత్రించగలిగే ఆ విత్తనాలేంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook