ఆహారపు అలవాట్లపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని ఇతర పదార్ధాలతో కలిపి అంటే కాంబినేషన్ ఫుడ్స్ ప్రమాదకరం. పాలు తాగిన తరువాత అందుకే కొన్ని పదార్ధాలు తినకూడదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది ముందూ వెనుకా ఆలోచించకుండా తినేస్తుంటారు. దిని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. కొన్ని ఆహార పదార్ధాల కాంబినేషన్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. హాని చేకూరుస్తుంది. ఇందులో ముఖ్యమైంది పాలు. పాలు తాగిన తరువాత కొన్ని పదార్ధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ఆ పదార్ధాలేంటో తెలుసుకుందాం..


పాలు తాగిన తరువాత తీసుకోకూడని పదార్ధాలు


నిమ్మకాయ


పాలు తాగిన వెంటనే నిమ్మకాయ ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికీ తినకూడదు. లేకపోతే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. పాలు తాగిన వెంటనే నిమ్మకాయ తీసుకుంటే..గ్యాస్ సమస్య ఉత్పన్నం కావచ్చు. అదే విధంగా నిమ్మకాయ కలిపిన ఆహారం తిన్న తరువాత కూడా పాలు తాగకూడదు.


ముల్లంగి


పాలు తాగిన వెంటనే ముల్లంగి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియ, చర్మ సమస్యలు పెరుగుతాయి.అందుకే పాలు తాగిన వెంటనే ముల్లంగి తినడం మంచిది కాదు.


చేపలు


పాలు తాగిన తరువాతైనా లేదా ముందైనా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. లేకపోతే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. పాలు తాగిన తరువాత చేపలు తింటే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. 


సిట్రస్ ఫ్రూట్స్


పాలు తాగిన తరువాత సిట్రస్ ఫ్రూట్స్ ఏవీ తినకూడదు.  పాలు తాగిన వెంటనే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల పోషక పదార్ధాల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా శరీరానికి పోషకపదార్ధాలు లభించవు. అందుకే పాలు తాగిన తరువాత చేపలు వంటివి ముట్టుకోకూడదు.


Also read: Ajwain Powder: నిద్రలేమితో బాధపడుతున్నారా..ఆ నీళ్లు తాగితే వెంటనే మంచి నిద్ర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook