Milk For Weight Gain In 15 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు తగ్గుతున్నారు. అంతేకాకుండా శరీర అకృతిని కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు బరువు పెరగడానికి వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ బరువు పెరగలేకపోతున్నారు. అయితే ఈ సులభంగా బరువు పెరగడానికి కాల్షియం, ప్రొటీన్లు అధిక పరిమాణంలో లభించే పాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరగడమేకాకుండా శరీరానికి ప్రోటిన్లు లభించి బాడీ ఫిట్‌గా కూడా మారుతుంది. అయితే పాలను తేనెలో కలుపుకుని తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. రెండింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని వ్యాధులను దూరంగా చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా పాలు తాగండి:
పాలు తేనె కలిపి తాగడం వల్ల పాలలో ఉండే బ్యాక్టీరియా శరీరంపై ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే దీని కోసం మీరు ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా స్వచ్ఛమైన తేనె కలిపి..రాత్రి పడుకునే ముందు ఆ పాలను తాగండి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.  


రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
పాలు, తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తాయి. పాలలో తేనె కలిపి తాగడం వల్ల శరీరంలో సులభంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే శక్తి కూడా ఇస్తుంది. కాబట్టి కోవిడ్‌ వల్ల రోగ నిరోధక శక్తితో బాధపడేవారు తప్పకుండా పాలలో తేనెను కలుపుకుని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తేనెలో ఉండే ఔషధ గుణాలు వ్యాధుల వల్ల వచ్చే బ్యాక్టీరియా సులభంగా తగ్గించడానికి కృషి చేస్తుంది. పాలలో తేనె కలిపి తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.  


బరువు పెరుగడం:
పాలు శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. తేనె, పాలు కలిపి తాగడం వల్ల బరువు తగ్గడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తేనెలో ఉండే క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా బాడీని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు పెరగాలనుకునేవారు క్రమం తప్పకుండా రాత్రి పూట పాలలో తేనె కలుపుని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.


జీర్ణక్రియ సమస్యలకు చెక్‌:
తేనెలో ఉండే ఎంజైములు జీర్ణక్రియకు అన్ని రకాలుగా మేలు చేస్తాయి. పడుకునే సమయంలో తేనె, పాలు కలుకుని తాగడం వల్ల ఆహారం బాగా జీర్ణమవుతుంది. అయితే చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ పాలను క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు సులభంగా తీరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పాలను తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను కూడా అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి