కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన గత ఏడాది నుంచి ఇప్పటివరకూ ప్రజలలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలు ప్రతిరోజూ తాగాలా వద్దా, తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ (Cholesterol) పెరుగుతుందా అనే భయాలు సైతం కొన్ని చోట్ల కలుగుతున్నాయి. శరీరంలో మంచి కొవ్వుతో పాటు చెడు కొవ్వులు ఉంటాయి. ప్రతిరోజూ పాలు తాగడం వలన ఎలాంటి హాని కలుగదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి మన శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు, విటమిన్ డి (Vitamin D), జీర్ణక్రియకు దోహదం చేసే కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి కావడానికి కొవ్వు పదార్థాలు అవసరం. పాలు (Milk Benefits) తాగడం ద్వారా ఇది మీకు కావాలసినంత లభిస్తుంది. కొవ్వులలో తక్కువ సాంద్రత గల ప్రొటీన్లు, అధిక సాంధ్రత గల ప్రొటీన్లు అనే రెండు రకాలున్నాయి. అధిక సాంద్రత గల ప్రొటీన్లు అనేది మంచి కొవ్వుగా చెప్పవచ్చు. రక్తంలో ఏర్పడే హానికర పదార్థాలను తొలగించేందుకు అధిక సాంద్రత ఉన్న ప్రోటీన్లు దోహదం చేస్తాయి. తక్కువ సాంద్ర ప్రొటీన్లు ఉన్న కొవ్వును చెడు కొవ్వు అంటారు. శరీరంలో కొవ్వు అధికంగా ఉంటే రక్తానికి అంత మంచిది కాదు. దాని వల్ల గుండె మరియు మెదడు పనితీరు క్షీణిస్తుంది.


Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు


కొవ్వు పెరగడానికి పాలకు సంబంధం లేదు
కొవ్వు అధికమైతే గుండెపోటు (Heart Problems) లేదా ఇతరత్రా గుండె సంబంధిత సమస్యల బారిన పడతారు. ప్రతిరోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో అధికంగా కొవ్వుశాతం ఉన్నవారు కచ్చితంగా పాలు తాగడం మానుకుంటున్నారు. అయితే ప్రతిరోజూ పాలు తాగే వారిలో కొవ్వు పెరగదని వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. శరీరానికి హాని చేసే ఇతరద్రా కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ పాలు మానివేయడం ద్వారా ఏ లాభం ఉండదట. శరీరంలో కొవ్వు పెరగడానికి, పాలకు ఎలాంటి సంబంధం లేదని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబెసిటీ రిపోర్ట్ చేసింది. 


Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం 


పాలు తాగడం వల్ల ప్రయోజనాలు (Health Benefits Of Milk)
ప్రతిరోజూ లేదా తరచుగా పాలుతాగే వారిలో చెడు కొలెస్ట్రాల్ మరియు మంచి కొలెస్ట్రాల్ తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. వీరి బీఎంఐ సైతం పాలు తాగనివారి కన్నా అధికంగా ఉంటుది. పాలు తాగే వారిలో ధమనులలో సమస్యలు వచ్చే అవకాశం 14 శాతం మేర తగ్గుతుంది. పాలు నిత్యం తీసుకునేవారిలో జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దూరం అవుతాయి. టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశాలను పాలు తగ్గిస్తాయి. పాలు అధికంగా తీసుకుంటే కొవ్వులు పెరుగుతాయని శాస్త్రీయంగా ఎక్కడా తేలలేదని గమనించండి. కనుక ఏ సందేహాలు లేకుండా పాలను తాగవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.


Also Read: COVID-19 For Diabetes Patient: డయాబెటిస్ పేషెంట్లకు కరోనా మరింత ప్రమాదకరం, ఈ జాగ్రత్తలు పాటించండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook