ఈ చిట్కాలు పాటిస్తే వేసవిలో మీ గుండె పదిలం

కరోనా వైరస్ లాంటి విపత్తుతో పోరాడుతున్న ప్రజలు సమ్మర్‌ను తేలికగా తీసుకుంటున్నారు. ఇది మీ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమ్మర్‌లో Heart Health Tips పాటించండి.

Updated: May 31, 2020, 01:24 PM IST
ఈ చిట్కాలు పాటిస్తే వేసవిలో మీ గుండె పదిలం
PC: Pixabay

ప్రజలు కరోనా లాంటి మహమ్మారితో పోరాటం చేస్తున్నారు. అందులోనూ ఇది వేసవికాలం. సూర్యుడు అగ్నిగోళంలా మండిపోతున్నాడు. దేశ వ్యాప్తంగా పగటి ఉష్టోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. కనకు మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలని డాక్టర్లు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారు సమ్మర్‌లో తమ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి.  సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు

 

ఆరోగ్యానికి మేలు చేసే అంశాలివే....

  • రోజుకు తగినంత నీరు తాగాలి. డి హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. శారీరక వ్యాయామం లాంటివి చేసిన తర్వాత నీరు అధికంగా తాగాలి. వేసవిలో మద్యానికి దూరంగా ఉంటే మంచిది. 
  • కొద్దిసేపు విరామం ఇస్తూ తరచుగా అల్పాహారం తీసుకోవచ్చు. పండ్లు, కొన్ని తాజా కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల ఆహారం జీర్ణమై మీకు సరైన సమయంలో ఆకలి వేస్తుంది. 
  • గుండె సంబంధిత సమస్య ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి. ఉప్పు ఎంత తీసుకోవాలన్నది డాక్టర్లను సంప్రదించి తెలుసుకోవాలి.
  • వేసవికాలం కనుక కాటన్ దుస్తులు ధరించాలి. లేత రంగు, పల్చని దుస్తులు వేసుకుంటే శరీరానికి అంత ఇబ్బంది ఉండదు.
  • ఎక్కువ ఎండ, వేడి ఉన్న సమయంలో శారీరక శ్రమ తగ్గించాలి. బాల్కనీ, ఇంటి డాబాలపై మిట్ట మధ్యాహ్నం వేళ ఉండకపోవడం మంచిది.  బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
  • అధిక రక్తపోటు (High Blood Pressure) ఉన్నవారు ఈ కాలంలో తరచుగా బీపీ చెక్ చేసుకోవాలి. బీపీ అనూహ్యంగా పెరిగినా, తగ్గినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
  • రోగ నిరోధకశక్తి కాస్త తగ్గినట్లు అనిపించినా, సత్తువ లేనట్లుగా అనిపిస్తే రక్తంలో పోటాషియం, సోడియం  ఏ మోతాదులో ఉందో చెక్ చేపించుకోవాలి.
  • అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగడం కొంత కాలం వాయిదా వేసుకోవాలి.  తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
  • వీలైతే చల్లని వాతావరణంలో ఉండేందుకు యత్నించాలి. ఇంట్లో వీలైతే ఫ్యాన్, కూలర్‌లు వాడితే కాస్త వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • శరీరాన్ని వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందేకు బాడీ లోషన్స్ వాడాలి. బయటకు వెళ్తే కచ్చితంగా మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.