Milk Side Effects: మీరు అతిగా పాలు తాగుతున్నారా? అయితే మీకు ఇదో హెచ్చరిక!
Milk Side Effects: ప్రతిరోజూ అవసరమైన దాని కంటే మీరు ఎక్కువగా పాలు తాగుతున్నారా? అలా తాగడం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Milk Side Effects: ప్రతిరోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికి తెలుసు. ఒక గ్లాసు పాలలో ఎంతో కాల్షియం ఉంటుంది. పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు ఎదుగుదలకు సహాయం పడడంతో పాటు వాటిని బలంగా మార్చేందుకు సహకరిస్తాయి.
బరువు తగ్గించడం సహా శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగయ్యేందుకు పాలు ఎంతగానో సహకరిస్తాయి. అదే సమయంలో ప్రతిరోజూ పాలు అతిగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) జీర్ణ సమస్య
మీరు ఎక్కువ పాలు తాగితే.. మీ జీర్ణక్రియ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్ణ సమస్య కారణంగా కడుపులో గ్యాస్ పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల అతిగా పాలు తాగకపోవడమే మంచిది.
2) అలసట, సోమరితనం
పాలు తాగడం వల్ల కొన్నిసార్లు విశ్రాంతి లేకపోవడం, అలసట, నీరసం వంటి సమస్యలు వస్తాయి. పాలను ఎక్కువగా తాగడం వల్ల అందులో ఉండే A1 కేసైన్ అనే మూలకం ప్రేగుల్లో మంటను ప్రేరేపిస్తుంది. దీంతో పాటు కడుపులో బ్యాక్టీరియాను పెరిగేందుకు ప్రోత్సహిస్తుంది.
3) చర్మ సమస్యలు
ప్రతిరోజూ పాలు అతిగా తాగడం వల్ల చర్మ సమస్యల బారిన పడే అవకాశం ఉంది. పాలలో ఉండే కొవ్వు పదార్ధాల కారణంగా ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
4) గుండె సమస్యలు
రోజుకు మూడు గ్లాసుల కంటే ఎక్కువ పాలు తాగితే గుండె సంబంధిత సమస్యలు రావొచ్చు. ఇదే విషయాన్ని అనేక పరిశోధనల్లో నిరూపించబడింది. అందుకే మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే రోజుకు ఎన్ని గ్లాసుల పాలు తాగాలో నిర్ణయించుకోండి.
Also Read: Red Marks on Skin: అరచేతిలో ఎర్రటి మచ్చలు ఉంటే ఆ భయంకరమైన వ్యాధికి సంకేతం!
Also Read: Sugarcane Juice: డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.