Red Marks on Skin: సాధారణంగా చాలా మందిలో చర్మంపై అనేక రకాల మచ్చలు కనిపిస్తుంటాయి. కానీ, ఎవరికైనా అరచేతిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడితే మాత్రం ఓ భయంకరమైన వ్యాధికి సంకేతమని వైద్యులు చెబుతున్నారు. అయితే అందుకు చికిత్స ఏమిటి? అరచేతిలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడడానికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎర్రటి దద్దుర్లకు కారణాలు..
కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. అధిక ఒత్తిడి, చర్మ సున్నితత్వం, తామర వంటి ఇతర చర్మ సంబంధిత సమస్యల కారణంగా అరచేతులపై దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్య ఉన్న వారి చేతిలో ఎర్రటి రంగు గల దద్దుర్లు ఏర్పడతాయి. ఇవి కొన్నిసార్లు వేడి బొబ్బల రూపంలోనూ ఉండే అవకాశం ఉంది. ఇవి రెండు నుంచి మూడు వారాల తర్వాత తగ్గిపోతాయి.
ఎర్రని మొటిమలకు చికిత్స
అరచేతిలో ఎర్రని మొటిమలు వంటి పోలికను కలిగిన బొబ్బర్లు మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి. దాని నివారణకు కొన్ని మందులు వాడమని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే ఇది ఎందుకు వస్తుందో కచ్చితమైన కారణం ఎవ్వరూ చెప్పలేరు. అదే విధంగా దీనికి సరైన మందు లేదు. దీని నివారణ కోసం ప్రతిరోజూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం సహా ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటే చాలు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొందరు నిపుణుల వద్ద నుంచి సేకరించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదిస్తే మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Sugarcane Juice: డయాబెటిక్ రోగులు చెరకు రసం తాగొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Also Read: Beauty Tips: వేసవిలో ఈ టిప్స్ పాటిస్తూ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.