Mixed Vegetable Rice recipe: ఆఫీస్‌లకు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేవారి కోసం ప్రతి రోజు ఏదైన కూరలను చేసి వండిస్తాం. కానీ కొన్ని సార్లు టైం సరిపోకుండా ఉంటుంది. ఎలాంటి కూర చేయాలో అర్థం కాదు. ఎలాంటి సమయంలో మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ రైస్‌ చేయడం ఏంతో సులభంగా ఉంటుంది. ఈ రైస్‌ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను తింటుంటాం. అయితే ఉద‌యం వంట ఏదో ఒక‌టి చేసేయాలి. ఆఫీస్ ల‌కు, కాలేజీలు, స్కూళ్ల‌కు వెళ్లేవారి కోసం బాక్స్ రెడీ చేయాలి. కానీ వంట చేసేందుకు కొంద‌రికి ఒక్కోసారి స‌మ‌యం ఉండ‌దు. లేదా ఏం కూర చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ సేపు ఆలోచించ‌కుండా వెంట‌నే మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ చేయండి. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి చేసే రైస్ ఇది. దీన్ని చేస్తే కూర చేయాల్సిన ప‌ని ఉండ‌దు. దీన్ని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌లో తిన‌వ‌చ్చు. ఇక దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:


రెండు కప్పుల బియ్యం, తగినంత నీళ్లు, ఇరువై గ్రాముల బీన్స్‌, నలభై గ్రాముల క్యారెట్‌ ముక్కులు, యాభై గ్రాముల ఆలుగడ్డ ముక్కులు, ఆరవైన గ్రాములు ప‌చ్చి బ‌ఠాణీలు,   నలభై గ్రాముల స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు, ఒక టీ స్పూన్‌ సాజీరా , దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు కొద్దిగా, వెల్లుల్లి, కొద్దిగా అల్లం పేస్ట్, రుచికి స‌రిప‌డా ఉప్పు, రెండు టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు, పది చొప్పున కిస్‌మిస్‌లు


Also Read Apple Vinegar Benefits: యాపిల్ వెనిగర్‌ను ఖాళీ కడుపుతో తాగడం మంచిదేనా.. మీరు కూడా ఇలా తాగుతున్నారా?


మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్‌ను త‌యారు చేసే విధానం:


ముందుగా కుక్కర్‌ పెట్టుకుని అందులో నూనె వేయాలి. ఆ తర్వాత నూనె కాగాక జీడిపప్పు, కిస్ మిస్ లను గోల్డెన్ కలర్ లో వేయించి తీసుకోవాలి. తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, సాజీర వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి.  ఉల్లిపాయ‌లు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. సముందుగా సిద్దం చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేయాలి.


చిన్న మంటపై వీటిని మగ్గించుకోవాలి. ఇవి నూనెలో మగ్గిన తరువాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకటికి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.  తరువాత మూత తీసిన తర్వాత ముందుగా వేయించుకున్న జీడి పప్పు, కిస్ మిస్ లతో గార్నిష్ చేసికోవాలి. అంతే మిక్స్‌డ్‌ వెజిటబుల్ రైస్ రెడీ అవుతుంది. 


Also Read Tulsi Benefits: తులసి ఆకులు రోజూ తింటే చాలు, ఏ వ్యాధి కూడా దరి చేరదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter