Benefits Of Eating Banana And Ghee: అరటి పండు, నెయ్యి అరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థాలు. ఈ రెండిటిలో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అరటి పండులో విటమిన్‌ సి, బి-6తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం ఇతర పోషకాలు అధికంగా లభిస్తాయి. నెయ్యిలో రోగనిరోధక శక్తి పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియా, యాంటీఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని ఉపయోగించడం వల్ల వైరస్, ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సమస్య నుంచి కాపాడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రెండిటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీని తినడం వల్ల కలిగే లాభాలు గురించి మనం తెలుసుకుందాం.


1. అరటి పండులో ఫైబర్‌, ప్రోటీన్లు, విటమిన్‌ లభిస్తాయి.ఒత్తిడి, ఆందోళ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. నెయ్యితో కాలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వచ్చే అనారోగ్యసమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. 


2. అరటి పండు, నెయ్యి కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. గ్యాస్‌, మలబద్దకం, అసిడిటీ కూడా తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


3.  అరటి పండు, నెయ్యి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. 


4.  అధిక బరువు త్వరగా పెరగాలంటే అరటిపండ్లు, నెయ్యి కలిపి తీసుకోవాలి. దీంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు. 


5. కండరాలు దృఢంగా మారాలి అంటే నెయ్యి, అరటి పండు కలిపి తీసుకోవాలి. 


6. అరటి పండు, నెయ్యి మగవారికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల శృంగా సామర్థ్యాన్ని పెంచుతుంది. 


7. నెయ్యి, అరటి పండు తీసుకోవడం వల్ల  సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


అరటి పండును నెయ్యితో కలిపి ఎలా తీసుకోవాలి: 


ముందుగా అరటిపండు, నెయ్యి తీసుకోవాలి. ఒక గిన్నెలో  రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తరువాత రెండు అరటి పండు తీసుకుని గుజ్జు తీసి బాగా కలుపుకోవాలి.  ఇందులో నెయ్యిని కలుపుకొని పరగడుపున తినడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. 


Also Read:  Silver Anklets: పాదాలకు బంగారం పట్టీలు ఎందుకు ధరించకూడదు ? కలిగే నష్టాలు ఏంటి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter