Monsoon Diet: భారత్‌లో ప్రస్తుతం కొన్ని చోట్ల వేసవి కాలం కొనసాగుతుంటే మరి కొన్ని చోట్ల రుతుపవనాలు ప్రవేశించి.. వర్షకాలం సీజన్‌ మొదలైంది. మారుతున్న సీజన్‌ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా పలు రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలున్నాయి.  వర్షకాలంలో తినే ఆహారంపై కూడా శ్రద్ధ వహించలానికి నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలంలో వీటిని జాగ్రత్తగా తినండి:


మండే ఎండలు వెళ్లి.. వాన కాలం మొదలైంది. మారుతున్న కాలనికి అనుగుణంగా పలు రకాల జాగ్రత్తలు కూడా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో తినే ఆహారంలో పోషకాలుండేల చూడడం చాలా ముఖ్యం.


ఆకు కూరలు తినేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి:


ప్రతి సీజన్‌లాగే వర్షాకాలంలో ఆకు కూరలు తినడం మంచిది. ఎందుకంటే వీటిలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కృషి చేస్తుంది.


ఆకులపై సూక్ష్మ కీటకాలు ఉండొచ్చు:


వర్షాకాలంలో వాతావరణంలో తేమ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వాతవరణం జెర్మ్స్ పెరగడానికి సహాయపడుతుంది. కావున పరిసర ప్రాంతాల్లో వీటిని నిల్వ ఉంచినప్పుడు ఆకులపై సూక్ష్మ కీటకాలు చేరే అవకాశాలున్నాయి. కావున  ఆకులను వండే క్రమంలో శుభ్రం చేసుకుని వండుకోవాలి.


ఆకులు కలుషితంగా మారొచ్చు:


వర్షాకాలంలో  పోషకాలున్న ఆకు గమనిస్తే దానిపై అన్ని రంధ్రాలు కనిపిస్తాయి. ఎందుకంటే వాటిపైకి కీటకాలు చేరి ఆకులపై గుండ్రని రంధ్రాలుగా చేస్తాయి. అందువల్ల ఆకులు కలుషితంగా మరే అవకాశాలున్నాయి.


కూరగాయలను ఇలా శుభ్రం చేయండి:


ప్రతి సీజన్‌లో కూరగాయలను కడిగి ఉడికించాలి. కానీ వర్షాకాలంలో గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రం చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నీటిలో ఉప్పు వేసి.. కూరగాయలను కాసేపు నానబెట్టిం శుభ్రం చేసుకోవడం ఎంతో మేలు.



వండే క్రమంలో జాగ్రత్త వహించండి:


కూరగాయలను వండే క్రమంలో వాటిని సరిగ్గా ఉడికించాలి. తద్వారా సూక్ష్మక్రిములు పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది


Also Read:  White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.