Monsoon Diet Tips: వర్షకాలం అంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ వాతావరనంలో తేమతో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దోమల ద్వారా ఇన్ఫెక్షన్, వ్యాధులు వ్యాపించవచ్చు. అయితే ఈ వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి పూర్వీకులు మొదటి నుంచీ కొన్ని రకాల సూచనలు చేస్తున్నారు. వానా కాలంలో తినే ఆహారంపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో తేమ వల్ల కూరగాయలు, పండ్లుపై సూక్ష్మ కీటకలు ప్రవేశించే అవకాశాలున్నాయి. కావున వీటిని తీసుకునే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలంలో ఏమి తినకూడదు: ( What not to eat in rainy season Telugu)


1. ఫ్రీజ్ ఉంచిన, ఫ్రోజెన్ ఫుడ్స్‌ను మానుకోండి: (Avoid Freeze and Frozen Foods)


ప్రస్తుతం చాలా మంది  ఫ్రోజెన్ ఫుడ్స్‌ తిసుకుంటూ ఉంటారు. తేమతో కూడిన వాతావరణంలో వీటిని తినడం మంచిది. కానీ వీటిని వర్షం కాలంలో తింటే..  కడుపులో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.


2. ఆకు కూరలు, కూరగాయాలు: (Avoid leafy Green Vegetables)


వర్షాకాలంలో ఆకుపై ఉష్ణోగ్రత, తేమ బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇది కడుపులో ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. అందువల్ల, బచ్చలికూర, మెంతి ఆకులు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ఆకు కూరగాయలను తినడం మానుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా సొరకాయ ఇతకర కూరగాయలను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


3. జంక్‌ ఫుడ్‌ తినడం, జ్యూస్ తాగడం మానుకోండి(Avoid Outside eating)


వర్షాకాలంలో ఉష్ణోగ్రత బాక్టీరియా, ఫంగస్ పెరుగుదలకు అనువైన వాతావరణం. ఈ వానా కాలంలో ఆహారం, నీటి ద్వారా ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రెస్టారెంట్లలో, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో ఆహారం తినడం మానుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కాలంలో బయట లభించే జ్యూస్ తాగడం వల్ల టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


4. సలాడ్లను అస్సలు తినకండి (Avoid Salad)


సలాడ్లలో పచ్చి కూరగాయలను వినియోగిస్తారు. పచ్చి ఆహారాన్ని తినడం వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మ బ్యాక్టీరియా శరీరంలోకి తక్షణమే ప్రవేశించే అవకాశాలున్నాయి. ఇది చివరికి వైరల్ ఇన్ఫెక్షన్లగా మారుతుంది.


5. పెరుగుతో భోజనం చేయకండి(Avoid curd and whey)


వర్షాకాలంలో పెరుగు తినడం శరీరానికి హానికరమని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే వీటిలో సైనసైటిస్‌ అనే పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.



 


Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!


Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.