Health Tips For Rainy Season | వర్షాకాలం (వానాకాలం) అనగానే ఎందుకో తెలియదు గానీ జాగ్రత్తలు గుర్తొస్తాయి. కాలం మారగానే కొన్ని సీజనల్ సమస్యలు, ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి సమయం కనుక డాక్టర్లు చెబుతున్న అంశం రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కనుక రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేసే ఆహారాన్ని (Vegetables For Rainy Season) తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Sputnik V: రష్యా వ్యాక్సిన్‌పై సీసీఎంబీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు


వర్షాకాలంలో తినాల్సిన కూరగాయలు (Vegetables For Rainy Season) 


  • కాకరకాయ తింటే మీ శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం లాంటి పోషకాలతో పాటు విటమిన్ సి లభిస్తుంది. చేదు ఉందని ఎక్కువ మంది తినరు. కానీ ఆ చేదు వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. ఎముకల బలాన్ని పెంచడంతో పాటు సీజనల్ జబ్బుల బారిన పడకుండా చేస్తుంది. కాకరకాయలో బీటా కెరోటిన్, ఫైబర్ లభిస్తాయి.

  • బెండకాయను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇందులో పీచు పదార్ధాలతో పాటు పోషకాలు లభిస్తాయి. లేత బెండకాయ తింటే శరీరం రిఫ్రెష్ అవుతున్న భావన కలుగుతుంది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే

  • కరోనా వ్యాప్తి సమయం కనుక సోరకాయ తినడం ఉత్తమం. యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు సొరకాయను తింటారు. కరోనా టైమ్‌లో ఇంట్లోనే కూర్చుని బరువు పెరిగేవారు ఈ కూర తరచుగా తినాలి.

  • వానాకాలంలో దుంపల్ని తినడం ఉత్తమం. భూమి లోని సారాన్ని అధికంగా తీసుకుంటూ పెరిగేవి దుంపలు. బంగాళాదుంపతో కూర, లేక ఫ్రై చేసుకుని తింటే మంచిది. ఎర్రగడ్డ (మొరంగడ్డ) లాంటి దుంపలు కాల్చుకుని లేక ఉడికించి తింటే పోషకాలు లభిస్తాయి. అయితే మోతాదుకు మించి తినవద్దు.

  • వేసవికాలంతో పాటు వర్షాకాలంలోనూ తినాల్సింది దోసకాయ. ఇది తింటే శరీరంలో విషపూరిత పదార్థాలను, వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరం ఉత్తేజితమైనట్లు అనిపించి వానాకాలం బద్దకం పోయి మీరు పనులు చురుకుగా చేస్తారు.  తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి