Itchy Scalp Remedies: వర్షాకాలం వచ్చిందంటే చాలు అరోగ్య సమస్యలు వెంటాడుతాయి. చర్మ సంబంధిత రోగాలతో పాటు స్కాల్ప్ దురద సమస్య ప్రధానంగా కన్పిస్తుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలమంటే అందరికీ పులకింతే. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందుల తప్పవు. అప్పటివరకూ వేసవి వేడితో విలవిల్లాడిన ప్రజలకు చల్లని వర్షం ఆహ్లాదం కల్గిస్తుంది. అదే సమయంలో చిక్కులు కూడా కొనితెస్తుంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా తలలో దురద ఎక్కువగా ఉంటుంది. దీనికి సాధారణంగా డాండ్రఫ్ కారణంగా ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటాం. స్కాల్ప్ దురద నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు పరిశీలిద్దాం..


స్కాల్ప్‌లో దురద ఉంటే..ఒక స్పూన్ మెంతులు తీసుకుని..అందులో ఒక స్పూన్ ఆవాలు మిక్స్ చేయాలి. ఈ రెండింటినీ పొడిగా చేసి..పేస్ట్‌గా మార్చాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు వేళ్లలో అప్లై చేయాలి. దాదాపు అరగంట తరువాత శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి. ఇక నిమ్మకాయతో కూడా ఈ సమస్య దూరమౌతుంది. నిమ్మలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఒక కప్పు నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకుని..తలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.


కేస్టర్ ఆయిల్‌తో కూడా జుట్టులో లేదా స్కాల్స్ దురద దూరం చేయవచ్చు. దీనికోసం మీరు ఒక స్పూన్ కేస్టర్ ఆయిల్, ఒక స్పూన్ గానుగ నూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. రాత్రి వేళ జుట్టుకు రాసి మాలిష్ చేసుకోవాలి. ఉదయం శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి. కొన్ని రోజుల్లోనే డాండ్రఫ్, దురద సమస్య పోతుంది. 


Also read: Roasted Black Gram: నల్ల శనగలు తింటే గుండె సమస్యలన్ని దూరమవుతాయి.. ఇంకా ఈ వ్యాధులు కూడా..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook