Monsoon Diet: వాతావరణం మారినప్పుడు ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. వర్షాకాలంలో కొన్ని రకాల కూరల విషయంలో అప్రమత్తంగా లేకపోతే..భారీ నష్టం కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్ని సీజన్లలోనూ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సింది వర్షాకాలంలోనే. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని రకాల కూరలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు తెలుసుకోవల్సింది ఏయే ఆహార పదార్ధాలు తినాలి, ఏవి తినకూడదనేది. ఎందుకంటే కొన్ని వస్తువులు ఆరోగ్యానికి మంచిదైతే..మరికొన్ని హాని కల్గిస్తాయి. అందుకే ఆహారం, నీరు విషయంలో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వర్షాకాలంలో సహజంగానే ఎక్కడ చూసినా తడి వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న గిన్నెల్లో ఏ మాత్రం నీరు నిల్వ ఉన్నా..క్రిమికీటకాలు మొదలవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తత అవసరం. నీళ్ల ట్యాంకులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో ఏం తినకూడదనేది ఇప్పుడు పరిశీలిద్దాం..


చాలామంది మష్రూమ్ ఇష్టంగా తింటుంటారు. కానీ వర్షాకాలంలో వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియా చర్మంలో ఇన్‌ఫెక్షన్లకు కారణమౌతుంది. ఫలితంగా జ్వరం, జలుబు, దగ్గు, వైరల్ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇక వర్షాకాలంలో వంకాయల్ని సాధ్యమైనంతవరకూ దూరంగా పెట్టాలి. వర్షకాలంలో వంకాయలకు డిమాండ్ అధికంగా ఉండటంతో..దిగుబడి పెంచేందుకు మందులు ఎక్కువగా వాడుతారు. అది పరోక్షంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు ఇందులో ఉండే పురుగులు కూడా హాని కల్గిస్తాయి. ఓవరాల్‌గా జీర్ణ సంబంధం సమస్యలు తలెత్తుతాయి.


మరో ముఖ్యమైన పదార్ధం షిమ్లా మిర్చి. సాధారణంగా కూరల రుచి పెంచేందుకు షిమ్లా మిర్చి తరచూ ఉపయోగిస్తుంటారు. పిజ్జా పాస్తాలో అయితే తప్పకుండా వినియోగించాల్సిందే. కానీ వర్షాకాలంలో షిమ్లా మిర్చిని తినకూడదు. వాతావరణంలో తడి కారణంగా త్వరగా పాడైపోతుంటాయి. ఫలితంగా ఇందులో ఆరోగ్యానికి హాని కల్గించే బ్యాక్టీరియా పుడుతుంది. దాంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.


Also read: Raw Milk Vs Boiled Milk: పచ్చిపాలు Vs వేడిపాలు.. రెండింటిలో ఏవి ఆరోగ్యానికి మంచివి.. ??



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook