Pakoda For Diabetes Control: మధుమేహాన్ని నియంత్రించే మెంతికూర పకోడా రెసిపీ..
Fenugreek Pakoda For Diabetes Control In 7 Days: డయాబెటిస్తో బాధపడేవారు ఎండాకాలంలో స్నాక్స్‌గా మెంతికూరతో తయారుచేసిన పకోడాలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయి.
Fenugreek Pakoda For Diabetes Control In 7 Days: ఎండాకాలంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే చాలామందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందిలో డీహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు కొన్ని డ్రింక్స్ ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్తో బాధపడే కొంతమందిలో హార్మోన్ల సమస్యల కారణంగా తరచుగా సాయంత్రం పూట ఆకలి అవుతూ ఉంటుంది. అయితే చాలామంది ఇలాంటి సమయాల్లో నూనెతో కూడిన అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు.
ఇలా అతిగా స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం కారణంగా కొంతమందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకున్న స్నాక్స్ తీసుకోవడం చాలా బెటరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవి సమయాల్లో ఈవినింగ్ స్నాక్స్‌గా ఆకుకూరలతో తయారుచేసిన పకోడాలను లేదా బజ్జీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మెంతికూరతో తయారుచేసిన పకోడాలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా పెరగకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పకోడాను మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా.? సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి.
మెంతి ఆకు పకోడా రెసిపీకి కావలసిన పదార్థాలు:
శనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
మెంతి ఆకులు - 1 కప్పు (కడిగి, తురిమినవి)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
అల్లం - చిన్న ముక్క (తురిమినది)
ఉప్పు - రుచికి తగినంత
కారం - 1/2 టీస్పూన్
ఇంగువ - 1/4 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
పెరుగు - 1/4 కప్పు (ఐచ్ఛికం)
నూనె - వేయించడానికి
తయారీ విధానం:
1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ఇంగువ, జీలకర్ర, ధనియాల పొడిని వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
2. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్న పిండిలోనే తురిమిన మెంతి ఆకులు, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలపాలి.
3. అదే పిండి గిన్నెలో కావాల్సినంత పెరుగు వేసి మరోసారి కలపాల్సి ఉంటుంది.
4. తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు పోస్తూ పకోడాల పిండిలా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
5. ఆ తర్వాత స్టవ్ పై బాణలి పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకొని వేడి చేయాల్సి ఉంటుంది.
6. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
7. వేడి వేడిగా టమాటో సాస్ లేదా చట్నీతో సర్వ్ చేయండి.
చిట్కాలు:
మెంతి ఆకులు చిన్నచిన్నగా తురిమినట్లయితే పకోడాలు క్రిస్పీగా వస్తాయి. కాబట్టి, చిన్న చిన్న ముక్కలుగా తురమడం మంచిది.
పెరుగు వేస్తే పకోడాలు మరింత రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పకోడాలు వేసే క్రమంలో నూనె బాగా వేడిగా ఉంటే అవి నూనె పీల్చకుండా ఉంటాయి.
కళాయిలో ఒకేసారి పకోడాలను వేయించడానికి బదులుగా కొద్దికొద్దిగా వేయించుకోవడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి