Mouni Roy Health Recovery Story: మౌని రాయ్ తెలుగుతో పాటు హిందీ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె నటించిన అనేక సినిమాలు, టెలివిజన్‌ సిరీయల్స్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే  మౌనీ రాయ‌ బాలీవుడ్‌ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒకప్పుడు 30 కిలోలు పెరిగారని, ఆ సమయంలో తన జీవితం అయిపోయిందని అనుకున్నారని తెలిపారు. ఆ సమయంలో ఆమె కేవలం నాలుగు- ఆరు రోజులు జ్యూస్‌లతో గడిపారని చెప్పుకొచ్చారు. అప్పుడు ఆమె ఆహారం తినడం చాలా ముఖ్యం అని భావించారని చెప్పారు. అంతేకాకుండా మోనీ L4-L5 స్లిప్ డిస్క్, కాల్షియం స్టోన్‌ సమస్యలతో బాధపడ్డారిని తెలిపారు. అసలు L4-L5 స్లిప్ డిస్క్ , కాల్షియం స్టోన్ సమస్యలు ఏంటో ? వాటి లక్షణాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

L4-L5 స్లిప్ డిస్క్ అంటే ఏమిటి? 


L4-L5 స్లిప్ డిస్క్ అనేది వెన్నుముకలోని ఒక సాధారణ సమస్య. వెన్నుముకలోని ఎముకల మధ్య మృదువైన డిస్క్‌లు ఉంటాయి. ఈ డిస్క్‌లు కుషన్‌లా పనిచేసి వెన్నుముకను రక్షిస్తాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ డిస్క్‌లు తమ స్థానం నుంచి జారిపోయి వెన్నుముక నరాలను నొక్కితే దీన్నే స్లిప్ డిస్క్ అంటారు. L4, L5 అనేవి వెన్నుముకలోని రెండు ఎముకలు. వీటి మధ్య ఉన్న డిస్క్ జారిపోతే దాన్ని L4-L5 స్లిప్ డిస్క్ అంటారు.


L4-L5 స్లిప్ డిస్క్ ఎందుకు వస్తుంది?


L4, L5 అనేవి వెన్నుముక కింది భాగంలోని రెండు ఎముకలు. ఈ రెండు ఎముకల మధ్య ఉన్న డిస్క్ జరిగిపోతే దాన్ని L4-L5 స్లిప్ డిస్క్ అంటారు. ఈ సమస్యకు కారణం   భారీ వస్తువులు ఎత్తడం, అకస్మాత్తుగా వంగడం లేదా తిరగడం వల్ల డిస్క్‌లు దెబ్బతింటాయి. ముఖ్యంగా అధిక బరువు వెన్నుముకపై ఒత్తిడిని పెంచి, డిస్క్‌లను దెబ్బతీస్తుంది.  కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, తప్పుగా కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.  కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా డిస్క్‌లు బలహీనంగా ఉంటాయి.


L4-L5 స్లిప్ డిస్క్ లక్షణాలు:


L4-L5 స్లిప్ డిస్క్ సమస్య లక్షణాలు ముందుగా వెనుక భాగంలో నొప్పి తీవ్రంగా కలుగుతుంది. ఇది  కూర్చోవడం, నిలబడటం లేదా నడవడం వల్ల మరింత తీవ్రమవుతుంది.  కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, బలహీనత లేదా నొప్పి, తరచుగా ఒకే వైపు కలుగుతంది. అంతేకాకుండా  తిమ్మిరి లేదా మొద్దుబారడం, ఇది వెన్నుముక నుంచి కాళ్ల వరకు వ్యాపిస్తుంది. దీని కారణంగా కాళ్లలో ముఖ్యంగా పాదాలు, వేళ్లు బలహీనత పడుతాయి. నడక లేదా నిలబడటం సమస్యలు.  అరుదుగా, L4-L5 స్లిప్ డిస్క్ మూత్ర లేదా మల విసర్జన సమస్యలకు కారణమవుతుంది. కొంతమందికి తీవ్రమైన నొప్పి ఉండవచ్చు, మరికొందరికి తక్కువ తీవ్రతతో ఉండవచ్చు. లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాలలో తగ్గుతాయి లేదా తీవ్రమవుతాయి.


కాల్షియం స్టోన్ అంటే ఏమిటి? 


కాల్షియం స్టోన్స్ అనేవి మూత్రపిండాలలో ఏర్పడే గట్టి ముద్దలు. ఈ రాళ్లు ప్రధానంగా కాల్షియం, ఆక్సలేట్ అనే రసాయనాలతో తయారవుతాయి. మనం తినే ఆహారంలోని కొన్ని పదార్థాలు  మన శరీరంలోని కొన్ని మార్పులు ఈ రాళ్ల ఏర్పడటానికి కారణమవుతాయి.


కాల్షియం స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి?


మనం తీసుకోనే ఆకు కూరలు, గింజలు, చాక్లెట్ వంటి ఆహారాల్లో ఆక్సలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రంలో కలిసి కాల్షియంతో కలిసి రాళ్లను ఏర్పరుస్తుంది. అలాగే  శరీరానికి తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం కేంద్రీకృతమై రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. హైపర్‌పారాథైరాయిడిజం, మూత్రపిండ వ్యాధులు వంటి కొన్ని వైద్య పరిస్థితులు కూడా కాల్షియం స్టోన్స్ ఏర్పడటానికి దోహదపడతాయి. కొన్నిసార్లు  మందులు కూడా కాల్షియం స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతాయి.


కాల్షియం స్టోన్స్ లక్షణాలు ఏమిటి?


తీవ్రమైన నొప్పి: ఇది పక్కటెముకల నుంచి కడుపు వరకు వ్యాపించే ఒక రకమైన కోలిక్ అని పిలుస్తారు. ఈ నొప్పి తరచుగా అలలు వచ్చినట్లుగా ఉంటుంది.


మూత్రం చేసేటప్పుడు నొప్పి: మూత్రం చేసేటప్పుడు మంట లేదా నొప్పి అనిపించవచ్చు.


మూత్రంలో రక్తం: కొన్నిసార్లు మూత్రంలో రక్తం కనిపించవచ్చు.


వికారం- వాంతులు: నొప్పి కారణంగా వికారం, వాంతులు కూడా రావచ్చు.


మూత్రం చల్లగా ఉండటం: మూత్రం సాధారణం కంటే చల్లగా ఉండటం.


జ్వరం- జలదరింపు: ఇన్ఫెక్షన్ ఉంటే జ్వర, జలదరింపు కూడా రావచ్చు.


గమనిక:


ఈ లక్షణాలు ఇతర వ్యాధులకు కూడా ఉండవచ్చు. కాబట్టి, ఈ లక్షణాలు మీకు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.


Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter