Fatty Liver Drinks: తినే ఆహారం జీర్ణం నుంచి శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించడం వరకూ అన్ని పనులు చేసేది లివర్ ఒక్కటే. అందుకే లివర్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా మొత్తం బాడీ నీరసపడిపోతుంది. మొత్తం బాడీ పనితీరుకు కారణం లివర్ మాత్రమే. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండటం ఆందోళన కల్గించే ఆంశం. లివర్ సమస్యలు రోజురోజుకూ అధికమౌతున్నాయి. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.
వివిధ రకాల ఆహారపు అలవాట్లు, వేళాపాళా లేని తిండి అలవాట్లు, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా ఉంటోంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించలేకుంటే ప్రాణాంతకం కావచ్చు. ఈ సమస్య ఉంటే మీరు ఎంత తిన్నా శరీరంలో సంగ్రహణ కాదు. ఎందుకంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తినే ఆహారంలోని పోషకాలు శరీరంలో సంగ్రహణ కావు.ఫలితంగా లివర్ ఫెయిల్ అవుతుంది. అందుకే ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినకూడదు. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ ఉదయం కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలి.
పసుపు టీ
ఆరోగ్యం కోసం ఇది బెస్ట్ ఆప్షన్. శరీరంలో అంతర్గతంగా లేదా బాహ్యంగా ఏ సమస్య వచ్చినా పసుపు అద్బుతమైన ఔషధం. పసుపు నీరు, పసుపు పాలు, పసుపు టీ ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఇదొక సూపర్ ఫుడ్ లాంటిది. రోజూ తాగడం అలవాటు చేసుకుంటే లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.
కాఫీ
కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీ కూడా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల సిరోసిస్ ముప్పు 44 శాతం తగ్గిపోతుంది. అదే రోజుకు 4 సార్లు కాఫీ తాగేవారిలో సిరోసిస్ సమస్య 65 శాతం తగ్గిపోతుంది.
గ్రీన్ టీ
హెల్తీ డ్రింక్స్ కేటగరీలో ముందుగా విన్పించేది ఇదే. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గ్రీన్ టీలో ఉండే కెటోచిన్, యాంటీ ఆక్సిడెంట్లు కణాల మరమ్మత్తుకు ఉపయోగపడతాయి. లివర్ ఆరో్గ్యాన్ని మెరుగుపర్చే బెస్ట్ డీటాక్స్ డ్రింక్ ఇది.
లెమన్ వాటర్
రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా లివర్ లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. లివర్ తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. ఇంటులో ఉండే విటమిన్ సి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్
ఫ్యాటీ లివర్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుందంటారు. ఇది రోజూ తాగడం వల్ల లివర్‌తో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో పేరుకున్న కొవ్వు కూడా కరుగుతుంది.
బీట్‌రూట్ జ్యూస్
ఇదొక బెస్ట్ లివర్ డీటాక్స్ డ్రింక్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. లివర్‌ను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also read: NEET UG 2024 Registration: నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook