Mulberry Fruit Benefits: మల్బరీ పండ్లతో బోలెడు లాభాలు.. బరువుతో పాటు మధుమేహానికి చెక్!
Health Benefits of Mulberry Fruit: మల్బరీ పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే మల్బరీ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Benefits of Mulberry Fruit: మార్కెట్‌లో వేసవిలో అనేక రకాల పండ్లు లభిస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఎండా కాలంలో శరీరానికి ఎంతో అనారోగ్యాన్ని అందించే పండ్లలో మల్బరీలు ఒకటి. ఇందులో శరీరానికి కావాల్సిన ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని వేసవిలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతుంది. దీంతో పాటు మల్బరీ తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలగుతాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలిపిన వివరాల ప్రకారం..మల్బరీలో అధిక పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే సైనైడింగ్ 3 గ్లూకోసైడ్ అనే మూలకం శరీరంతోని రక్తప్రసర వ్యవస్థను మెరుగు పరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
మల్బరీ తినడం వల్ల ఈ ప్రయోజనాలు లభిస్తాయి:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
మల్బరీని క్రమం తప్పకుండా సలాడ్స్‌లో తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ సి, జింక్, మాంగనీస్ శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే సమస్యలు కూడా దూరమవుతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
మల్బరీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ప్లాస్మా శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మధుమేహాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మల్బరీలో అధిక పరిమాణంలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రేగు కదలికలను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు పొట్టను శుభ్రం చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు, ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
మల్బరీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా సులభంగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అల్జీమర్స్‌తో బాధపడేవారికి కూడా మల్బరీ ఔషధంగా పని చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి