Mutton Side Effects: మటన్ ఇలా తింటున్నారా? యమ డేంజర్.. క్యాన్సర్ కొనుక్కొని తెచ్చుకున్నట్లే!
Mutton Side Effects: చాలామంది మటన్ అధిక మోతాదులో రోజు తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల క్యాన్సర్ కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Mutton Side Effects: చాలామంది మటన్‌ను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. నిజానికి ఒక రోజైనా ఈ రెడ్ మీట్ ని తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది రోజు మటన్ తింటున్నారు. ప్రతిరోజు మటన్ తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్‌లో అధిక ప్రోటీన్‌తో పాటు విటమిన్లు కూడా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొలెస్ట్రాల్‌ను పెంచే మూలకాలు కూడా ఉంటాయి కాబట్టి రోజు తినడం చాలా డేంజర్. అయితే చాలామంది రోజు మటన్ తింటున్నారు. ఇలా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి
మటన్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
కొలెస్ట్రాల్ పెరుగుదల:
ప్రతిరోజు మటన్ తినడం వల్ల శరీరానికి సంతృప్తికర కొవ్వులు అధిక మోతాదులో లభిస్తాయి. దీనివల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ అధిక మోతాదులో పెరిగిపోతుంది. దీంతో గుండెజబ్బులు స్ట్రోక్ వంటి ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి మటన్ అధికంగా తినేవారు దీనిని దృష్టిలో పెట్టుకుంటే ఎంతో మంచిది.
అధిక బరువు పెరగడం:
మటన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొంతమందిలో ఊబకాయం వంటి సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని కొవ్వు ఎక్కువ మోతాదులో పెరుగుతుంది. ఇది అధిక బరువుకు దారితీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహాన్ని పెంచుతుంది:
మటన్ లోని కొన్ని రకాల ప్రోటీన్లు శరీరంలోని చక్కర పరిమాణాలను అధిక మోతాదులో పెంచుతాయి. దీని కారణంగా హార్మోన్ల నియంత్రణ పై ప్రభావం పడి మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే మధుమేహం ఉన్న వారిలో రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా పెరుగుతాయి.
యూరిక్ యాసిడ్:
చాలామందిలో మటన్ ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ పరిమాణాలకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో శరీరంలోని హార్మోన్ల పై ప్రత్యేకమైన ప్రభావం పడి కీళ్లనొప్పులతో పాటు మోకాళ్లు నొప్పులు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంతమందిలో ఇతర సమస్యలు కూడా వస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
క్యాన్సర్ ప్రమాదం:
మటన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని కొన్ని రకాల క్యాన్సర్ కణాలు తయారవుతాయి. దీని కారణంగా వివిధ రకాల క్యాన్సర్లతో పాటు ఇతర ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న వారు దీనిని తినకపోవడం ఎంతో మంచిది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.