Mysterious Death Alert: ఒమిక్రాన్ ఓవైపు ప్రపంచాన్ని చుడుతూ వస్తుంటే..మరోవైపు అంతుచిక్కని భయంకర వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఆ భయంకర వ్యాది కారణంగా ఇప్పటి వరకూ భారీ ఎత్తున మరణాలు సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిపై ఇప్పుడు అధ్యయనం చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పుతో ఓ వైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే..మరోవైపు అంతుచిక్కని రహస్యవ్యాధి వ్యాపిస్తోందనే వార్తలు కలవరం రేపుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా దక్షిణ సుడాన్‌లోని అటవీప్రాంతపు ఉత్తరాది నగరం ఫంగాక్‌లో పెద్దఎత్తున ప్రజలు మరణిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధితుల వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేయడం కోసం ఓ టీమ్‌ను అక్కడికి పంపింది.


వ్యాధి ఏంటో తెలుసుకునేందుకు, దర్యాప్తు చేసేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను(Rapid Response Team) అక్కడికి పంపినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థకు(WHO) చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ బృందం బాధితుల్నించి శాంపిల్స్ సేకరించనుంది. ఇప్పటి వరకూ అందిన డేటా ప్రకారం దాదాపు 89 మంది ఈ వ్యాధి కారణంగా మరణించినట్టు సమాచారం. ఇటీవల సంభవించిన వరద బాధిత ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉంది. అందుకే హెలీకాప్టర్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందంటున్నారు ఆ టీమ్ సభ్యులు. జోంగ్లేయీ సరిహద్దు ప్రాంతపు రాష్ట్రాల్లో భయంకరమైన వరద(Floods)కారణంగా మలేరియా వంటి వ్యాధులు పెరిగాయని సుడాన్(Sudan)మంత్రి ఒకరు స్పష్టం చేశారు.ఆహారం లేకపోవడంతో చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు. ఇక్కడి నీరు ఆయిల్‌తో కలిసి కలుషితమైందని..దాంతో పెంపుడు జంతువులు కూడా చాలావరకూ చనిపోయాయని తెలుస్తోంది. దక్షిణ సుడాన్‌కు చెందిన ఉత్తరాది ప్రాంతంలో వరద..ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఓ శాపంగా మారింది.


ఐక్యరాజ్యసమితి (UNO)శరణార్జి విభాగైన యూఎన్‌హెచ్‌సీఆర్ ప్రకారం దేశంలో దాదాపు 60 ఏళ్లలో రానటువంటి భయంకర వరదతో పెద్దఎత్తున జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జలవాయు మార్పులే దీనికి కారణంగా తెలుస్తోంది. వరద కారణంగా తలెత్తిన పరిస్థితులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. ఓవైపు కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే..మరోవైపు ఈ వ్యాధి(Mysterious Disease)భయం గొలుపుతోంది. 


Also read: Deadline Dates and Works: డిసెంబర్ 31 లోగా తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook