Seeds Use: ఈ విత్తనాలను పారేయకండి.. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి..
Seeds Use: సాధారణంగా మనం పండ్లు, కూరగాయలు తినేసినా తర్వాత వాటి విత్తనాలను పారవేస్తాం. అయితే వాటి వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ సీడ్స్ తినడం వల్ల మీ గుండె ధృడంగా ఉంటుందట.
Seeds Use: కొన్ని పండ్లు, కూరగాయల యెుక్క గింజలు, విత్తనాలు (Seeds) కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. కానీ చాలా మంది వీటిని విసిరేస్తారు. అయితే ఈ విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయట. ఇందులో ఫైబర్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల ఉంటాయి. వీటిని ఏదైనా వంటకంలో చేర్చి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds) పారేయకండి. వీటిలో అధికమెుత్తంలో కొవ్వులు, విటమిన్లు ఉన్నాయి. ఇవీ మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడికాయ గింజలను పచ్చిగా తినవచ్చు కానీ కాల్చిన గింజలు అయితే ఎంతో రుచికరంగా ఉంటాయి.
బొప్పాయి గింజలు:
అంతే కాకుండా బొప్పాయి గింజలు (Papaya Seeds) కూడా బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి గింజలు అనేక వ్యాధులకు ఉత్తమ చికిత్సగా నమ్ముతారు. ఈ విత్తనం అనేక వ్యాధుల ప్రమాదాన్ని మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. మీరు బొప్పాయి గింజలను పచ్చిగా తినవచ్చు, కానీ వాటిని తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
చింతపండు గింజలు:
ఇది కాకుండా, చింతపండు గింజలు (Tamarind Seeds) కూడా మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విత్తనాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా...మీ దంతాలకు కూడా మేలు చేస్తాయని నమ్ముతారు. అంతే కాదు వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ.
Also Read: Health benifits of Potatoes: బంగాళదుంపలతో మీకు తెలియని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook