Omicron Latest Study: ఒమిక్రాన్ తాజా అధ్యయనంలో ఆందోళన కల్గించే అంశాలు, ప్రమాదకరమే మరి
Omicron Latest Study: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సంక్రమణ వేగం పుంజుకుంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో తాజా పరిశోధన ఆందోళన కల్గిస్తోంది.
Omicron Latest Study: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సంక్రమణ వేగం పుంజుకుంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో తాజా పరిశోధన ఆందోళన కల్గిస్తోంది.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరోసారి చుట్టేస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తూ ఆందోళన రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఏ మేరకు ప్రమాదకరమనే విషయంలో ఇప్పటి వరకూ సందేహాలు నెలకొన్నాయి. తాజా అధ్యయనంతో ఆ సందేహాలన్నీ తొలగిపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఏ విధమైన హాని కల్గించదు. అయితే అనారోగ్యానికి గురైన వ్యక్తులకు మాత్రం ఇది ప్రమాదకరంగా మారుతుందనేది కొత్త అధ్యయనం. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.
యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌పై (Omicron Variant)చేసిన ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై జర్మనీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ లక్షణాలు కన్పించకపోయినా..శరీరంపై మాత్రం ప్రభావం కచ్చితంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇన్‌ఫెక్షన్ స్వల్పంగా ఉన్నా సరే..శరర భాగాల్ని దెబ్బతీస్తుందని కనుగొన్నారు. ఈ అధ్యయనం నిమిత్తం 45-74 సంవత్సరాల వయస్సున్న 443 మందిని పరిశీలించగా..ఒమిక్రాన్ సోకినప్పుడు వీరికి అవయవ నష్టం జరుగుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో ఊపిరితిత్తుల (Omicron Effect on Lungs) పనితీరు 3 శాతం తగ్గినట్టు తెలిసింది. వాయుమార్గానికి అంటే శ్వాస మార్గంలో సమస్యలు కన్పించాయి. స్వల్ప లక్షణాలున్నవారిలో కూడా గుండెపై ప్రభావం చూపిస్తోంది. గుండె పంపింగ్ శక్తి 1-2 శాతం వరకూ తగ్గింది. రక్తంలో ప్రోటీన్ స్థాయి 41 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఇది నేరుగా గుండెపై ఒత్తిడి పెంచుతుంది. మరో ఆందోళన కల్గించే విషయం కూడా ఉంది. కాళ్ల సిరల్లో రక్తం గడ్డకట్టడం, లెగ్ వెయిన్ థ్రాంబోసిస్ వంటివి స్వల్ప లక్షణాలున్నవారిలో కూడా కన్పించింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే కాళ్ల సిరల్లో రక్తం గడ్డకడితే ఏర్పడే ప్రతిష్ఠంభన అత్యంత ప్రమాదకరం. ఇది రోగి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. అందుకే ఇప్పుడు ఈ తాజా అధ్యయనం ఆందోళన రేపుతోంది.
Also read: Superfoods for Skin : ఈ 6 సూపర్ ఫుడ్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook