Superfoods for Skin : ఈ 6 సూపర్ ఫుడ్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం..

Superfoods for Skin, healthy and glowing skin : చర్మ నిగారింపు కోసం సహజసిద్ధమైన ఆహారాలు తీసుకోవాలలి. స్కిన్‌ కోసం కొన్ని సూపర్‌‌ ఫుడ్స్‌ ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 12:39 AM IST
  • చర్మ నిగారింపు కోసం సూపర్‌‌ఫుడ్స్‌
  • చర్మం తాజాగా, యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి...
  • సహజసిద్ధమైన 6 సూపర్‌‌ ఫుడ్స్‌తో ఆరోగ్యకరమైన చర్మం
Superfoods for Skin : ఈ 6 సూపర్ ఫుడ్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం..

Superfoods for Skin These 6 superfoods that promise to give you healthy and glowing skin : మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ నిగారింపు ఆధారపడి ఉంటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్‌లు, (Proteins) పోషకాలను అందించకపోతే.. చర్మం తాజాగా, యవ్వనంగా కనిపించదు. పీచుపదార్థాలు లేని ప్రాసెస్ చేసిన ఆహారాలను (processed foods) తీసుకుంటే చర్మం డల్‌గా మారిపోతుంది. అలాగే పొడిబారడం, మొటిమలు, నల్లటి వలయాలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సూపర్‌ఫుడ్స్‌ (Superfoods) తీసుకుంటే మీ చర్మానికి నిగారింపు (Skin care) వస్తుంది. నిత్య యవ్వనంగా కనపడతారు. మరి ఆ సహజసిద్ధమైన 6 సూపర్‌‌ ఫుడ్స్‌పై (6 Super‌‌ Foods‌) ఓ లుక్కేద్దాం పదండి.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ (Blueberries) చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బ్లూబెర్రీస్‌లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో ఆంథోసైనిన్ కూడా ఉంటుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్స్‌ చర్మం ముడతలపడకుండా, పొడిబారకుండా ఉండేందుకు దోహదపడతాయి.

అవకాడో

అవకాడో (Avocado) కూడా స్కిన్‌కు బాగా మేలు చేస్తుంది. దీన్ని సూపర్‌ఫుడ్‌గా తీసుకోవడం వల్ల మీ చర్మానికి నిగారింపు వస్తుంది. ఇందులో ఒమేగా9 వంటి పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించి బ్యాక్టీరియాపై పోరాడుతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ E కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే అవకాడోను తరుచుగా తీసుకోవడం వల్ల చర్మం పై భాగంలో ఉండే ఎపిడ్యూరల్ పొర హైడ్రేట్ అవుతూ ఉంటుంది. 

టమోటా

టమోటాలను (Tomatoes) రెగ్యులర్ తీసుకుంటే చర్మానికి ఎంతో మేలు. ఇందులో ఉండే లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ వల్లే టమోటా (Tomato) ఎర్రగా ఉంటుంది. అలాగే దీనికి సెబమ్ ఉత్పత్తిని, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అదుపులో ఉంచగల శక్తి ఉంటుంది. అందువల్ల రెగ్యులర్‌‌గా టమోటాలను తింటూ ఉండడం చర్మానికి మంచింది. టమోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

కలబంద

కలబందలో (Aloe Vera) యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు, విటమిన్లు ఏ, బీ, సీ, ఈ, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉంటాయి. కలబందనుప్రతిరోజూ మాయిశ్చరైజింగ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. అలాగే హైడ్రేషన్, చర్మం నిగారింపు కోసం కొబ్బరి నీళ్లలో, కలబంద రసాన్ని (Aloe vera juice) కలుపుకుని తాగవచ్చని డెర్మటాలాజిస్ట్స్ సూచిస్తున్నారు. 

సముద్రపు నాచు

సముద్రపు నాచు (Sea Moss) తయారు చేసే జెల్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా మొటిమల మచ్చల సులభంగా పోతాయి. అలాగే చర్మం రంగు పాలిపోకుండా చేస్తుంది. సముద్రపు నాచు ఎక్కువగా క్యాప్సూల్ రూపంలో లభిస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ కణాల పునరుత్పత్తికి ఉపయోగపడతాయి. 

Also Read : Ananya Pandey Latest Pics: బీచ్ లో ఒంటరిగా సేదతీరుతున్న లైగర్ బ్యూటీ అనన్యా పాండే

మునగ

మునగలో (Moringa) విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఏ సిట్రస్ పండ్లలో లేని విధంగా ఇందులో విటమిన్ సి ఉంటుంది. మునగ చర్మాన్ని కాంతివంతంగా చేయగలదు. చర్మంపై వృద్ధాప్య లక్షణాలు కనపడకుండా చేయగలదు. మునగతో తయారు చేసే వంటకాలను తినడం చర్మానికి చాలా మేలు. ఈ 6 సూపర్ ఫుడ్స్ మాత్రమే కాకుండా నిమ్మ, పసుపు, చిలగడదుంపలు మొదలైనవి కూడా ఈ హెల్తీ డైట్ (Diet) కేటగిరీ కిందకే వస్తాయి. ఇవి కూడా మీకు చర్మ నిగారింపునకు దోహదపడతాయి.

Also Read : Sonal Chauhan Bikini Pics: బ్లాక్ బికినీలో అందాలు ఆరబోస్తున్న బాలయ్య హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News