Vaccine Side Effects: కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికీ సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ దుష్పరిణామాల భయంతో చాలామంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్న నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా మహమ్మారిని(Corona Pandemic)ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా చాలామంది వ్యాక్సిన్‌కు భయపడుతూనే ఉన్నారు. వ్యాక్సిన్ వల్ల తలెత్తే దుష్పరిణామల భయం దీనికి కారణం. ఈ నేపధ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. 


కరోనా వ్యాక్సిన్(Corona vaccine) వేయించుకున్నవారిలో దుష్పరిణామాలు అత్యంత స్వల్పమేనని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 53 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయగా..కేవలం 2 లక్షల 50 వేలమందికి మాత్రమే అది కూడా స్వల్ప దుష్పరిణామాలు తలెత్తాయని తెలిసింది. ఇటు ఏపీలో కూడా ఇప్పటి వరకూ 2.52 కోట్లమందికి వ్యాక్సినేషన్ జరగగా..కేవలం 873 మందికి మాత్రమే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ప్రభావం కన్పించింది కేవలం 0.003 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ(Union Health Ministry)పరిశీలనలో వెల్లడైంది. తీవ్రత ఎక్కువగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందినవారు కేవలం 13 మంది మాత్రమేనని ఆరోగ్యశాఖ తెలిపింది. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు, గర్భిణీలకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్(Vaccine Side Effects) కన్పించలేదు. అందుకే కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఏ విధమైన సందేహాలు అవసరలం లేదని ఆరోగ్యశాఖ భరోసా ఇస్తోంది. 


Also read: Corona Revaccination: కరోనా బూస్టర్ డోసుకు అనుమతి లేదంటున్న కేంద్ర ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook