Obesity Reduce Diet: ప్రస్తుతం ఆధునిక జీవనశైలిలో ఊబకాయం అనేది సాధారణ సమస్యగా మారింది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది. అయితే ఈ సమస్య కారణంగా అనేక రకాల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థూల కాయం అనేక వ్యాధులకు మూలం.. కాబట్టి ఎంత సులభంగా శరీర బరువును నియంత్రించకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థూలకాయంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాల్లో ముఖ్యమైన పదార్థాలను చేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ అధిక మోతాదులో ఉండే ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం నానబెట్టిన గింజలను ప్రతి రోజు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది అంతేకాకుండా ఊబకాయాన్ని కూడా అయంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


ఒమేగా-3 పుష్కలంగా ఉండే అవిసె గింజలను రాత్రిపూట నానబెట్టి , ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్ గా మార్చేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తున్న ని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ప్రతిరోజు ఉదయం రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్ష, అంజీర్ పండ్లను ప్రతి రోజు తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తుంది. దీంతోపాటు మెటబాలిజాన్ని స్ట్రాంగ్‌గా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


శరీర బరువును నియంత్రించేందుకు బాదం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు నీటిలో నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ఫైబర్, ప్రోటీన్స్ లభించి సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook