Obesity Weight Loss Diet Plan: శరీర బరువు పెరగడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా కొంతమందిలో శరీర బరువు జీన్స్ కారణంగా కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది శరీర బరువు కారణంగా అందహీనంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు తప్పకుండా అవసరం ఎంతగానో ఉంది. ముఖ్యంగా ఈ కింది 5 అలవాట్లు ఉండడం వల్లే శరీర బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ శరీర బరువు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ క్రింది 5 అలవాట్లను మానుకోవడం చాలా మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని విచ్చలవిడిగా తీసుకోవడం వల్లే శరీర బరువు పెరుగుతున్నారు:


ఆయిల్ ఫుడ్ తినడం:
తరచుగా ఆయిల్ ఫుడ్స్ ని విచ్చలవిడిగా తింటున్నారు. దీని కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడి బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొలెస్ట్రాలను నియంత్రించుకోవడం చాలా మంచిది లేకపోతే ప్రాణాంతకమైన గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ఆయిల్ ఫుడ్ ను ప్రతిరోజు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.


సరిగ్గా నడవకపోవడం:
చాలామంది టిఫిన్, లంచ్, డిన్నర్ చేసిన తర్వాత నడవకుండా అలానే కూర్చుండి పోతారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలామందిలో పొట్ట పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.


అతిగా తీపి వస్తువులను తినడం:
తరచుగా తీపి వస్తువులను తింటూ ఉంటారు అయితే దీని కారణంగా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగి, తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తీపి పదార్థాలు అతిగా తినడం వల్ల కొందరిలోనైతే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని అతిగా తినకపోవడం చాలా మంచిది.


నిద్ర లేకపోవడం:
సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా శరీర బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు పెరిగే కారణాలు నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది.


Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్


Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి