Oil for speed Hair growth: జుట్టుపెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటాం. వీటి వల్ల మీ జుట్టు బలంగా ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలని అన్ని ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు కొన్ని డైట్‌ మార్పులు చేసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాదం నూనె..
బాదం నూనెలో విటమిన్స్, ప్రొటీన్లు, టోకోఫెరల్స్‌ ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఈ ఆయిల్‌ ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ బాదం ఆయిల్‌ లైట్‌ వెయిట్ ఉంటుంది. జుట్టు త్వరగా గ్రహిస్తుంది కూడా. దీంతో మీ కుదుళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.


ఆముదం..
ఆముదం నూనెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది కూడా జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా స్కాల్ప్‌ ఆరోగ్యానికి కూడా ప్రేరేపిస్తుంది. ఆముదంలో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. మినరల్స్‌, విటమిన్‌ ఇ ఉంటుంది. ఆముదంలో రైసినోలీక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మం దురదను తగ్గిస్తుంది.


కొబ్బరినూనె..
మీ జుట్టు మందంగా మారడానికి కొబ్బరినూనె ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఏళ్లుగా కొబ్బరి నూనెను జుట్టు ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్‌, కార్బ్స్‌ జుట్టుకు మాయిశ్చర్‌ నిలుపుతాయి. జుట్టుకు లోతైన పోషణ అందించి స్కాల్ప్‌ను ఆరోగ్యవంతం చేస్తుంది.


గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌..
గ్రేప్‌ సీడ్సతో తయారు చేసే ఈ గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో జుట్టు ఆరోగ్యానికి సహాయపడే ఔషధ గుణాలు ఉంటాయి. గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌ వాడటం వల్ల మీ జుట్టు ఆయిలీగా మారుతుంది. అందుకే మీరు హెయిర్‌ వాష్‌ చేసేటప్పుడు కండీషనర్ కూడా ఉపయోగించడం మేలు..


ఆలివ్‌ ఆయిల్‌..
ఆలివ్‌ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజసిద్ధమైన కండీషనర్‌ మాదిరి జుట్టుపై పనిచేస్తుంది. ఇందులో ఒలీక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఇ ఉంటుంది. ఈ రెండూ జుట్టు పెరుగుదలకు ఎంతో అవసరం. దీంతో మీ జుట్టు రాకెట్‌ స్పీడ్‌లో పెరుగుతుంది.


పెప్పర్మెంట్‌ ఆయిల్‌..
పెప్పర్మెంట్‌ ఆయిల్‌లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే గుణాలు ఉంటాయి. పెప్పర్మెంట్‌ ఆయిల్‌ బ్లడ్‌ సర్క్యూలేషన్‌ను కూడా బూస్ట్‌ చేస్తుంది. స్కాల్ప్‌ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ ఆయిల్‌ హెయిర్‌ ఫొలికల్స్‌ను బలపరుస్తుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది.


రోజ్మెరీ ఆయిల్‌..
ఈ ఆయిల్‌తో కూడా మీ జుట్టు మ్యాజిక్‌ చేసినట్లు పెరిగిపోతుంది. ఇది హెయిర్‌ ఫొలికల్స్‌ను ప్రేరేపించి జుట్టును ఆరోగ్యంగా పెంచుతుంది. ఈ నూనె అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా కుదుళ్లకు మెరుగవుతుంది. జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. హెయిర్‌ ఫాల్‌ సమస్యకు చెక్‌ పెడుతుంది. రోజ్మెరీ ఆయిల్‌తో డ్యాండ్రఫ్‌ కూడా తొలగిపోతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి