Okra Water Benefits: ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. భారీ ఎండల కారణంగా శరీరం ఎంతో కొంత డిహైడ్రెషన్‌కు గురవుతూ ఉంటారు.  నీటి శాతం తగ్గడం పోషక విలవలున్న ఆహారం తీసుకొక పోవడం వల్ల ఈ సమస్యకు గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో అధికం కనిపిస్తుంటాయి.  దీని నుంచి రక్షణ పొందేందుకు వేసవి కాలంలో పోషకాలను కలిగిన ఆహారం తీసుకోవాలి. వేసవిలో కొన్ని రకాల ఆకు కూరలు, కూరగాయలు తినడం వల్ల డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనాలుంటాయని వైద్యుల తెలిపారు. అందులో ముఖ్యంగా బెండకాయ ఎక్కువ ప్రయోజనాన్నిఇస్తుందని సూచించారు. అయితే బెండకాయలో అధిక పోషక విలువలున్నాయని.. వాటిని నీటిలో నానపెట్టుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు ఇస్తాయని పేర్కొన్నారు. ఇలా నానపెట్టిన నీటిని ఓక్రా వాటర్‌ అని తెలిపారు. ఇది డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, శరీరంలో బ్లడ్‌లో షుగర్ నియంత్రించేందుకు ఓక్రా వాటర్ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వేసవిలో డయాబెటిస్ పేషెంట్లకు ఓక్రా వాటర్ ఎంత మేలు తెలుసా.!


బెండకాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. తద్వారా శరీరానికి ఫైబర్, విటమిన్-బి6 , ఫోలేట్ పుష్కలంగా అందుతాయి. విటమిన్-బి డయాబెటిక్ నియంత్రించేందుకు తోడ్పడుతుందని, శరీరంలో మధుమేహానికి ప్రధాన కారణమైన హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తాయని నిపుణులు తెలిపారు. ఈ ఓక్రా నీరు శరీరంలో చక్కెరను స్థాయిని స్థిరంగా ఉంచుతుందని, తద్వారా శరీరానికి ఎంతో మేలు జరుతుందని సూచించారు.



డయాబెటిస్ నియంత్రణ:


బెండకాయలో ఉన్నకేలరీలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఓక్రా నీరును తాగడం వల్ల శరీరంలోని రక్తంలో చెక్కర శాతాన్ని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఓక్రా నీరు రక్తంలోని నెమ్మదిగా చోచ్చుకుపోయి  భేండీలో ఉన్న కేలరీలను విడుదల చేస్తుంది. ఇదే కాకుండా ఓక్రాలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న చెక్కర స్థాయిని సులువుగా తగ్గిస్తుంది.



ఈ ఓక్రా నీటిని ఎలా తయారు చేసుకోవాలి:
ఓక్రా తయారు చేసుకునేందుకు ముందుగా  5 నుంచి 6 బెండకాయాలను తీసుకొని వాటిని బాగా కడగాలి.  రెండు పొడవాటి భాగాలుగా కట్ చేయాలి. ఈ కట్ చేసిన ముక్కలను నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని వడబోసుకుని తాగితే శరీరంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.


Also Read: Cm Kcr Plenary: టీఆర్ఎస్‌కు తెలంగాణ పెట్టని కోట: సీఎం కేసీఆర్


Also Read: Horoscope Today April 23 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు 'రియల్ ఎస్టేట్‌'కు దూరంగా ఉంటే మంచిది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook