Omicron Symptoms in Kids : కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోంది. పిల్లల్లో కూడా ఇప్పుడు కొవిడ్, ఒమిక్రాన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా కరోనా బారినపడుతున్నారు. అయితే కొవిడ్, ఒమిక్రాన్‌ (Omicron) బారినపడిన పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని బట్టి పిల్లలు కొవిడ్ బారినపడ్డట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. కరోనా (Corona) సోకి ఆసుపత్రిలో చేరిన పిల్లల్లో 44 శాతం మంది ఎక్కువగా నరాల సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఇక ఈ అధ్యయన ఫలితాలు పీడియాట్రిక్ న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించారు. 


కొవిడ్ (Covid) బారినపడిన పిల్లల్లో.. ఆ వైరస్ పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. కరోనా సోకిన పిల్లల్లో నాడీ సంబంధిత లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ (Vaccination) జరుగుతోంది. అయితే చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాలేదు. దీంతో చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అసవరం ఉంది. చిన్నపిల్లల్లో ఈ లక్షణాలుంటే అవి కొవిడ్ లక్షణాలుగా గుర్తించి జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. 


పిల్లలు జ్వరంతో (Fever) పాటు తలనొప్పితో బాధపడుతుంటే.. వీలైనంత త్వరగా కోవిడ్ టెస్ట్‌ చేయించండి. కొవిడ్‌ ఇన్ఫెక్షన్ గురైన చిన్నారుల్లో తలనొప్పి లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన జలుబు, (Cold) పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కూడా కొవిడ్‌కు దారి తీస్తాయి. అందువల్ల ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించడం మేలు. జ్వరం, ఒళ్లు నొప్పులతో పిల్లలు బాధపడుతుంటే కొవిడ్‌గా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణ జ్వరంగా భావించి, ఏవేవో మందులు పిల్లలకు ఇవ్వకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడండి.


Also Read : Omicron Survival: ఒమిక్రాన్ మనుగడ.. మనిషి చర్మంపై 21 గంటలు, ప్లాస్టిక్‌పై 8 రోజులు
ఇక పిల్లల్లో పై లక్షణాల్లో ఏదీ కనిపించినా సరే.. వారి మైండ్ బ్యాలెన్స్ కూడా అదుపుతప్పుతుంది. అందువల్ల అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. కరోనా (Corona) వైరస్ బారిన పడే పిల్లలు మానసికంగా కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, పరిస్థితి మరింత దిగజారకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పిల్లలకు చికిత్స అందించడం మేలు.


Also Read: FIR on Sundar Pichai: సుందర్ పిచాయ్​కి నిన్న పద్మ పురస్కారం- నేడు కాపీరైట్​ కేసు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook