Onion Pulusu Recipe: ఉల్లిపాయ పులుసు అంటే ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రాచుర్యం ఉన్న ఒక రకమైన పులుసు. ఇది తీపి, ఉప్పు, పులుపు రుచుల కలబోకతో చాలా రుచికరంగా ఉంటుంది. అన్నం, ఇడ్లీ, దోసతో బాగా సరిపోతుంది. ఉల్లిపాయ పులుసు చాలా త్వరగా చేయగలిగే ఒక రుచికరమైన వంటకం. ఇది ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేయబడుతుంది.  ఇంట్లోనే ఈ పులుసును తయారు చేసి ఆస్వాదించవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఉల్లిపాయ పులుసులోని ప్రధాన పదార్థమైన ఉల్లిపాయ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా ఉల్లిపాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కంపౌండ్స్ శరీరంలోని మంటను తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఉల్లిపాయలోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


కావలసిన పదార్థాలు:


ఉల్లిపాయలు - 2 (తరగాలి)
తగినంత ఆయిల్
జీలకర్ర - 1/2 tsp


పసుపు - 1/4 tsp
కారం - రుచికి తగినంత


కొత్తిమీర - కట్ చేసి
ఉప్పు - రుచికి తగినంత
ఆవాలు - 1/2 tsp


ఎండు మిరపకాయలు - 2-3
కరివేపాకు - కొద్దిగా
గుప్పెడు పప్పు
తగినంత నీరు


తయారీ విధానం:


ముందుగా ఒక పాత్రలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి వేగించాలి. ఆ తర్వాత తరగ తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.  వేయించిన ఉల్లిపాయలకు  పసుపు, కారం వేలుసుకోవాలి. వేరొక పాత్రలో పప్పును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి, పైన చెప్పిన మిశ్రమంలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి తగినంత నీరు, ఉప్పు వేసి మరిగించాలి. ఆ తర్వాత చింతపండు పులుసును రుచికి తగినంతగా కలుపుకోవాలి. ఒక పాత్రలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి పోపు చేసి, పులుసులో వేయాలి.  చివరగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర వేసి బాగా కలిపి వడ్డించాలి.


నోట్: ఈ రెసిపీని మీ రుచికి తగినట్లుగా మార్పు చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేయవచ్చు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.