Wearing Face Mask Issues: ఫేస్ మాస్కు ధరిస్తే నిజంగానే ఈ సమస్యలు వస్తాయా?
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం (Face Mask) చేయాలని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మాస్కులు ధరించడం వల్ల అధికంగా కార్బన్ డయాక్సైడ్ (CO2) అధికంగా విడుదల అవుతుందని, మరోవైపు శ్వాస సంబంధిత సమస్యలు (Wearing Face Mask Issues) తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది.
ప్రపంచ దేశాలను ప్రస్తుతం పట్టి పీడిస్తున్న సమస్య కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం (Face Mask) చేయాలని వైద్యులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మాస్కులు ధరించడం వల్ల అధికంగా కార్బన్ డయాక్సైడ్ (CO2) అధికంగా విడుదల అవుతుందని, మరోవైపు శ్వాస సంబంధిత సమస్యలు (Wearing Face Mask Issues) తలెత్తుతాయని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి.
Also Read : Benefits of Almonds: బాదం నానబెట్టి ఎందుకు తినాలి..? అందుకు కారణాలివే!
ఫేస్ మాస్కు ధరించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ అధిక మొత్తంలో విడుదల కావడం అనేది వాస్తవం కాదు. శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పత్తి అవుతాయన్నది సైతం కేవలం వదంతులు మాత్రమేనని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన థోర్నసిక్ సోసైటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జన సంచారం ఉన్న ప్రాంతంలో, ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో కచ్చితంగా మాస్కు ధరించాలని, వైరస్ బారి నుంచి అదే మార్గమని అభిప్రాయపడ్డారు.
Also Read : CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!
మాస్కు ధరించడం వల్ల క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ (COPD) ఉన్న వారికి మాత్రమే శ్వాసకోశ సంబంధిత సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో ఉన్న వారిలోనూ ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయని రీసెర్చ్లో తేలింది. కానీ అలాంటి వ్యక్తులు శ్వాస అందేలా ఉండే మాస్కులను ధరించాలని సూచించింది.
Also Read : Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
ఫేస్ మాస్కు ధరించినప్పుడు కొందరిలో డిస్నియా లేదా శ్వాస సరిగా అందని పరిస్థితి తలెత్తుతుంది. అయితే అది కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదల కావడం వల్ల ఉత్పన్నమైన సమస్య కాదు. మీరు ఉన్న చోట గాలి ప్రసరణ (వెంటిలేషన్) సరిగా లేని పక్షంలోనే అధికంగా ఆ సమస్య ఉంటుందని గుర్తించారు. ఎవరూ లేని ప్రదేశంలో నడవడం, ఉన్నట్లయితే మాస్కును ధరించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe