Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Health Tips In Telugu | చూయింగ్ గమ్ తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్‌సైజ్ అయి కాస్త గ్లో అనిపిస్తుంది. తరచుగా చూయింగ్ గమ్ (Chewing Gum for Weight Loss) నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు.

Last Updated : Sep 23, 2020, 06:20 PM IST
Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

చూయింగ్ గమ్ (Chewing gum) నములుతుంటే  మీ శ్వాసలో తాజాదనం లభిస్తుంది. మీ పళ్లను క్రిముల నుంచి రక్షిస్తుంది. అయితే కొంతమందిలో ఓ అపోహ ఉంది. నేను తరచుగా బబుల్‌గమ్ (Chewing gum) తింటున్నాను తిని వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడతానని భావిస్తుంటారు. అయితే చూయింగ్ గమ్ తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్‌సైజ్ అయి కాస్త గ్లో అనిపిస్తుంది. CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!

అధిక కేలరీలు ఖర్చు (Weight Loss Tips) అవుతాయా లేదా అనే దానిపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వాటిన పరిశీలిస్తే.. చూయింగ్ గమ్ నమిలినంత మాత్రాన అధిక కేలరీలు తగ్గే అవకాశం లేదని, కేవలం నిర్ణీత ఆహారం, ఫుడ్ డైట్ ప్లాన్ చేస్తేనే ఆరోగ్యం ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది. Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి

చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు (Chewing Gum for Weight Loss)
తరచుగా చూయింగ్ గమ్ నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు.

అరగంట పాటు షుగర్ లేని చూయింగ్ గమ్ నమిలిన వారితో పోల్చితే ఈ అలవాటు లేని వారు అధికంగా తింటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 

చూయింగ్ గమ్ నమలుతూ కూర్చోవడంతో తాము ఏదో తింటున్నామన్న ఆలోచనతో తక్కువ ఆహారం, స్నాక్స్ తింటారు. ఇది బరువు తగ్గేందుకు (Weight Loss) ఉపకరిస్తుంది. చూయింగ్ గమ్ నమలని వారు కనీసం 68 కేలరీల ఆహారం అధికంగా తీసుకుంటారట. Health Tips: ఒంట్లో అధిక వేడి తగ్గించే చిట్కాలు

ఈ అలవాటు ఉన్నవారిలో లేనివారితో పోల్చితే రోజులో అధిక కేలరీల శక్తి ఖర్చవుతుంది. 5శాతం వరకు అధిక కేలరీలు చూయింగ్ గమ్ తినేవారిలో ఖర్చవుతాయని గుర్తించారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్ మధ్య విరామంలోనే ఇది పనిచేస్తుందట. 

మామూలుగా ఓ చోట కూర్చుని చూయింగ్ గమ్ తింటున్న వారితో పోల్చితే వాకింగ్ చేస్తూ చూయింగ్ గమ్ నమిలే వారిలో బరువు తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయి. నడిచేటప్పుడు అధికంగా శ్వాస తీసుకోవడం, త్వరత్వరగా నమలడం, జీర్ణక్రియ సైతం వేగం పెరిగి అధిక కేలరీలు త్వరగా ఖర్చవుతాయి. అయితే షుగర్ ఫ్రి బబుల్ గమ్‌లు మాత్రమే నమలాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News